ఏలూరు పర్యటనలో సీఎం..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ప‌ర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ఏలూరు పర్యటనలో సీఎం..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

Updated on: Nov 04, 2020 | 4:34 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ప‌ర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గని భరత్, ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఏలూరు పర్యటనలో భాగంగా రూ.355 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు. తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏలూరు నగరంలోని శ్రీసూర్య కన్వెన్షన్‌ హాల్‌లో ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, నూర్జహాన్‌ల కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రెండు కార్యక్రమాల పర్యటన అనంతరం హెలికాప్టర్‌లో ఏలూరు నుంచి తాడేపల్లికి సీఎం జగన్ తిరుగుపయనమయ్యారు. ఈ పర్యటనలో జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గని భరత్, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి, ఎలిజా, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు ఉన్నారు. అంత‌కు ముందు ఏలూరుకు వచ్చిన సీఎం జగన్‌కు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు.