ఇసుక మాఫియాకు చెక్.. ఆన్‌లైన్‌తో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుకింగ్..

ఏపీలో ఇసుకను వినియోగదారులకు సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు.

ఇసుక మాఫియాకు చెక్.. ఆన్‌లైన్‌తో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుకింగ్..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 6:03 PM

ఏపీలో ఇసుకను వినియోగదారులకు సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మరింత పారదర్శకంగా ఇసుక విక్రయాలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌తో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ జరిగేలా చర్యలు చేపట్టారు.

పోర్టల్ ను ఎక్కువ సమయం తెరిచి వుంచాలని నిర్ణయించారు. 1 నుంచి 5, ఆపై ఆర్డర్ స్ట్రీం లలో కూడా ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేస్తారు. దీంతో 5 కి.మీ. పరిధిలోని ప్రజల అవసరాలకు వెలుసుబాటు కలుగుతుంది. వర్షాకాల కోసం 70 లక్షల ఎంటిల ఇసుక నిల్వ లక్ష్యంగా చేసుకున్నారు. రోజుకు 3 లక్షల ఎంటిల ఇసుక తవ్వకాలు జరపాలని నిర్ణయించారు.

దీంతో అడిగిన వారందరికీ ఇసుక సరఫరా చేసేలా చర్యలు తిసుకుంటున్నారు. ఇసుక నాణ్యతను పరిశీలించేందుకు టెక్నికల్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై జాయింట్ కలెక్టర్ లకే బల్క్ బుకింగ్ ల బాధ్యత అప్పగించనున్నారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండేళ్ళ జైలుశిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టాన్ని చేసిందని భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

Also Read: విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..