సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు సీఎం జగన్

|

Aug 29, 2020 | 10:03 PM

కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఆయన ఇడుపులపాయ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రెండు రోజుల టూర్‌ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కడప సబ్‌ కలెక్టర్ పృథ్వితేజ్, పాడా ఓఎస్డీ అనిల్‌ కుమార్, ఇతర అధికారులతో...

సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు సీఎం జగన్
Follow us on

కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఆయన ఇడుపులపాయ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రెండు రోజుల టూర్‌ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కడప సబ్‌ కలెక్టర్ పృథ్వితేజ్, పాడా ఓఎస్డీ అనిల్‌ కుమార్, ఇతర అధికారులతో కలిసి జేసీ ఇడుపులపాయలో పనులు పర్యవేక్షించారు.

హెలిప్యాడ్, బారికేడ్లు, బందోబస్తు, వీఐపీల సీటింగ్ అరేంజ్‌మెంట్స్‌ ఏర్పాట్లు చూశారు. థర్మల్ స్క్రీనింగ్, మాస్కుల ఏర్పాటుపై చర్చించారు. సీఎం కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేశారు.

ఇదిలావుంటే.. వాడుక భాషాద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. గ్రాంధికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని.. పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి అని అన్నారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యుల చేతికందించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగుని సన్మానించుకోవడమే అని ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు.