విజయ నిర్మల మృతికి ఇద్దరు సీఎంల నివాళి..

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటని పేర్కొన్నారు. అలాగే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా విజయనిర్మల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి చిత్ర పరిశ్రమకి తీరని లోటని […]

విజయ నిర్మల మృతికి ఇద్దరు సీఎంల నివాళి..

Edited By:

Updated on: Jun 27, 2019 | 8:35 AM

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటని పేర్కొన్నారు.

అలాగే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా విజయనిర్మల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి చిత్ర పరిశ్రమకి తీరని లోటని అన్నారు. కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.