ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నకిలీ మందులపై సమాచారమిస్తే రివార్డు

|

Aug 04, 2020 | 9:05 AM

నకిలీ మందులకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే నకిలీ ఔషధాలపై కొరడా ఝుళిపించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నకిలీ మందులపై సమాచారమిస్తే రివార్డు
Follow us on

Jagan Review Meeting On Drug Control: ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది అందరి మాట. అయితే దళారులు ఎక్కువైపోవడంతో మార్కెట్‌లో నకిలీ మందుల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే నకిలీ ఔషధాలపై కొరడా ఝుళిపించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా ఔషధ నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. నకిలీ ఔషధాలను నియంత్రించేందుకు డ్రగ్ కంట్రోల్‌లో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మార్కెట్‌లో నకిలీ మందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్ తయారీ యూనిట్లలోని నాణ్యతపై దృష్టి సారించడమే కాకుండా భారీ జరిమానాలు విధించేలా కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు. అటు ప్రభుత్వాస్పత్రుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు జరగాలని ఆదేశించారు. నకిలీ మందులపై ఫిర్యాదు ఎవరికి చేయాలి.? ఏ నెంబర్‌కు సమాచారం అందించాలన్న అంశాలు మందుల దుకాణాల వద్ద డిస్ ప్లే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలెవరైనా నకిలీ మందుల తయారీ, విక్రయంపై సమాచారం అందిస్తే.. వారికి రివార్డులు ఇవ్వాలని సూచించారు. కాగా, విజయవాడలోని ల్యాబ్‌తో పాటు కర్నూలు, విశాఖపట్నంలో సిద్దమవుతున్న ల్యాబ్‌లలో సామర్ధ్యాన్ని పెంచాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

”సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య”!

సుశాంత్ చనిపోయే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసింది ఇవే.!