ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. శనివారం గణేష్ చతుర్థి సందర్భంగా.. ఒక రోజు ముందుగానే ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు సీఎం. అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు అమలుకు ఎదురవుతున్న విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోవాలని పేర్కొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
Read More:
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన రైనా
ప్రభాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చా?