శ్రీశైలం ప్రమాద ఘటనలో ఒకరి మృత దేహం గుర్తింపు

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృత దేహం లభ్యమైంది. మృతుడు ఏఈ సుందర్‌గా అధికారులు గుర్తించారు. మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

శ్రీశైలం ప్రమాద ఘటనలో ఒకరి మృత దేహం గుర్తింపు
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 21, 2020 | 2:27 PM

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృత దేహం లభ్యమైంది. మృతుడు ఏఈ సుందర్‌గా అధికారులు గుర్తించారు. మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొలుత ప్యానల్‌ బోర్డులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ఫ్లాంట్ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్‌ కేంద్రంలో 30 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వారిలో వీరిలో 15 మంది సొరంగ మార్గం అత్యవసర ద్వారం గుండా బయటపడ్డారు. అందులో చిక్కుకున్న మిగతా వారిలో ఆరుగురిని సహాయక సిబ్బంది రక్షించారు. మిగిలిన తొమ్మిది మంది లోపలే చిక్కుకు పోయారు. తెల్లవారు జాము నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు