గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాము…

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాము...

Updated on: Oct 02, 2020 | 1:44 PM

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామగ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ… భూ వివాదాలకు ఎక్కడా తావు లేకుండా డిజిటల్ సర్వే ద్వారా పంపిణీ చేశామన్నారు.

గిరిజనులకు భూమితో పాటు రైతు భరోసా కింద సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పంటలు పండించుకునేందుకు గిరిజనులకు ఆర్ధిక సాయం కూడా చేస్తామని అన్నారు. లక్షా 53వేల మంది గిరిజనులకు 3.12లక్షల ఎకరాల భూమి పంపిణీ, రైతు భరోసా సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

గిరిజనులకు ఫారెస్ట్‌ అధికారులతో పాటు కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తారని సీఎం తెలిపారు. పాదయాత్రలో గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులను చూశానని… గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలని.. గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలన్నారు. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు.