సెలవుపై వెళ్లిన గోపాలక్రిష్ణ ద్వివేది..

| Edited By:

May 11, 2019 | 1:01 PM

ఈ నెల 14న జరగాల్సిన ఏపీ కేబినెట్ ఎజెండాలోని అంశాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదానికి పంపించింది. నిన్న ఎజెండాలోని అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆమోదించింది. అయితే.. ఆ అంశాలను ఈసీ ఆమోదం నిమిత్తం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల క్రిష్ణ ద్వివేదీకి పంపించారు ఎల్వీ సుబ్రమణ్యం. ఈ సాయంత్ర అమరావతి నుంచి ఎజెండా కాపీని ఢిల్లీ సీఈసీకి పంపించారు ద్వివేదీ. సోమవారం సాయంత్రం సీఈసీ నుంచి […]

సెలవుపై వెళ్లిన గోపాలక్రిష్ణ ద్వివేది..
Follow us on

ఈ నెల 14న జరగాల్సిన ఏపీ కేబినెట్ ఎజెండాలోని అంశాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదానికి పంపించింది. నిన్న ఎజెండాలోని అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆమోదించింది. అయితే.. ఆ అంశాలను ఈసీ ఆమోదం నిమిత్తం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల క్రిష్ణ ద్వివేదీకి పంపించారు ఎల్వీ సుబ్రమణ్యం. ఈ సాయంత్ర అమరావతి నుంచి ఎజెండా కాపీని ఢిల్లీ సీఈసీకి పంపించారు ద్వివేదీ. సోమవారం సాయంత్రం సీఈసీ నుంచి ఆమోదం లభిస్తే 14వ తేదీన ఏపీ మంత్రి వర్గ సమావేశం నిర్వహించవచ్చని పేర్కొన్నారు.

కాగా.. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేది సెలవుపై వెళ్లారు. ఇవాళ్టి నుంచి 15వ తేదీ వరకూ ఆయన సెలవు తీసుకున్నారు. తిరిగి 16వ సచివాలయానికి చేరుకుంటారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ద్వివేది సెలవుతు తీసుకున్నట్లు అధికారికంగా తెలిసింది.