బీజేపీ నుంచి లంకా దినకర్ సస్పెండ్

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నియమావళి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.

బీజేపీ నుంచి లంకా దినకర్ సస్పెండ్

Updated on: Oct 20, 2020 | 4:28 PM

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నియమావళి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్ణయాలు, ఆదేశాలను ధిక్కరిస్తే తొలుత షోకాజు నోటీసు జారీ చేసి, వివరణ సరిగా లేకుంటే వేటు వేస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే పార్టీ నుంచి తొలగిస్తున్నారు. తాజాగా  లంకా దినకర్‌కు అధిష్టానం షాకిచ్చింది. పార్టీ విధానానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా సొంత అజెండాతో చర్చల్లో పాల్గొంటున్నారని సీరియస్ అయ్యింది. గతంలో జారీచేసిన షోకాజ్‌ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే.. మళ్లీ టీవీ చర్చల్లో పాల్గొన్నాంటున్నారని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఆయన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా లంకా దినకర్ గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో బీజేపీలో చేరారు. పార్టీ సస్పెన్షన్‌పై లంకా దినకర్ ఇంకా స్పందించలేదు.

Also Read :

దేశంలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..?

ఉదయ్ ‘మనసంతా నువ్వే’కి 19ఏళ్లు.. ఎమ్మెస్ రాజు ‌ఎమోషనల్