ఏపీ హాట్ పాలిటిక్స్: టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు టెన్ డేస్ టైమిచ్చిన ప్రివిలేజ్‌ కమిటీ

|

Dec 23, 2020 | 1:22 PM

తెలుగుదేశం పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు వివరణ ఇచ్చేందుకు పది రోజుల సమయం ఇచ్చింది ప్రివిలేజ్‌ కమిటీ. వారిపై ఆంధ్రప్రదేశ్ అ..

ఏపీ హాట్ పాలిటిక్స్:  టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు టెన్ డేస్ టైమిచ్చిన ప్రివిలేజ్‌ కమిటీ
Follow us on

తెలుగుదేశం పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు వివరణ ఇచ్చేందుకు పది రోజుల సమయం ఇచ్చింది ప్రివిలేజ్‌ కమిటీ. వారిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదించిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చించింది. సీఎం జగన్‌తోపాటు మంత్రి కన్నబాబుపై టీడీపీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల్ని స్పీకర్‌ ఇంకా తమకు రిఫర్‌ చేయలేదని స్పష్టం చేశారు కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌. మరోవైపు, మద్యపాన నిషేధం అంశంలో అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఒక నోటీసు ఇచ్చారు. స్పీకర్‌ను దూషిస్తూ ప్రెస్‌నోట్‌ విడుదల చేసినందుకుగాను అచ్చెన్నాయుడిపైనే జోగి రమేష్‌ మరో నోటీసు ఇచ్చారు. ఇక, ‘చేయూత పథకం’పై నిమ్మల రామానాయుడు కావాలనే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం జగనే స్వయంగా నోటీసు ఇచ్చారు. వీటిపైనే ఇవాళ సమావేశమైన ప్రివిలేజ్‌ కమిటీలో చర్చించారు. టీడీపీ నేతల వివరణ తీసుకునేందుకు పది రోజుల సమయం ఇస్తున్నట్లు సమవేశం అనంతరం మీడియాకు చెప్పారు కాకాని గోవర్ధన్‌.