సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం రక్షణ రంగంపై ప్రత్యేక ఫోకస్ చేసింది. రక్షణ రంగాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు కేంద్రం పూనుకుంది. ఇందు భాగంగానే రక్షణ రంగంలో సాంకేతికంగా అత్యంత పురోగతిని సాధిస్తోంది. ఆత్మ నిర్భర భారత్ నినాదంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మిస్సైల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది డీఆర్ డీవో. తాజాగా యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రంను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించారు. డీఆర్‌డీవో ఈ మిస్సైల్‌ను అభివృద్ధి పరిచింది. రేడియో తరంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రేడార్లను ఈ మిస్సైల్ గుర్తించగలదు. ఇటీవల వరుసగా క్షిపణి పరీక్షలను డీఆర్‌డీవో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భారత్.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను పరీక్షించింది.
India today successfully testfired the ‘Rudram’ Anti-Radiation Missile from a Sukhoi-30 fighter aircraft off the east coast.
The Missile has been developed by the Defence Research and Development Organisation (DRDO). pic.twitter.com/soVBa1eVMx
— ANI (@ANI) October 9, 2020