AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేకు అస్వస్థత

బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం

బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేకు అస్వస్థత
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2020 | 2:59 PM

Share

Former MLA Thati Venkateswarlu : బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం భద్రాద్రి టీఆర్‌ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు చీరల పంపిణీ కార్యక్రమంను ఆయన ప్రారంభించారు.

మహిళలకు చీరలు పంచుతూ.. చేతులు జోడించి నమస్కరిస్తూనే ఒక్కసారిగా కిందపడిపోయారు. అందరికీ శుభాకాంక్షలు చెబుతూ అప్పటిదాకా సందడిగా కనిపించిన వెంకటేశ్వర్లు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయన పరిస్థితి గమనించిన స్థానికులు ఆయన్ను కుర్చీలో కూర్చుబెట్టి ప్రాథమిక చర్యలను అందించారు. అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Follow Us