న్యూ ఇయర్ ఎఫెక్ట్: మందుబాబులకు షాకిచ్చిన మెట్రో..!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే కాక్‌టైల్, మందు పార్టీలతో యువత హడావుడి మాములుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరాన్ని వెల్‌కమ్ చెప్పడానికి పబ్‌ల నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇక ఫ్యామిలీలు అయితే ఇప్పటికే భారీ కేక్‌లకు ఆర్డర్‌లు ఇచ్చేస్తున్నారు. ఇలా రాజధానిలో న్యూ ఇయర్ జోష్ అప్పుడే ప్రారంభమైందని చెప్పాలి. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా పోలీసులు మందుబాబులకు ముందుగానే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మందు తాగి రోడ్డెక్కితే 10 వేలు […]

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే కాక్‌టైల్, మందు పార్టీలతో యువత హడావుడి మాములుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరాన్ని వెల్‌కమ్ చెప్పడానికి పబ్‌ల నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇక ఫ్యామిలీలు అయితే ఇప్పటికే భారీ కేక్‌లకు ఆర్డర్‌లు ఇచ్చేస్తున్నారు. ఇలా రాజధానిలో న్యూ ఇయర్ జోష్ అప్పుడే ప్రారంభమైందని చెప్పాలి. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా పోలీసులు మందుబాబులకు ముందుగానే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మందు తాగి రోడ్డెక్కితే 10 వేలు ఫైన్ మాత్రమే కాకుండా జైలు శిక్ష పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మందుబాబులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ‘మెట్రో రైళ్లు’ కూడా మందుబాబులకు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
తాజాగా బెంగళూరు మెట్రో రైలు నిర్వాహకులు మందుబాబులకు షాక్ ఇచ్చారు. న్యూ ఇయర్‌కు కొత్త నిబంధనను అమలులోకి తీసుకొస్తూ.. మందు తాగి వెళ్ళేవాళ్ళకు మెట్రో రైళ్లలో ‘నో ఎంట్రీ’ అని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఇదే నిబంధనను హైదరాబాద్ మెట్రో కూడా అమలులోకి తెచ్చేలా కనిపిస్తోంది. దీని బట్టి చూస్తే.. తాగి మెట్రోలో ప్రయాణించాలనుకునే వారు మరో ప్రత్యామ్మాయం చూసుకోవాల్సిందే.




