మధ్యాహ్న భోజనంలో జగన్ మార్క్ మార్పులు..!!

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలో సీఎం జగన్ సమీక్షించారు. గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పై వారితో చర్చించారు. ప్రస్తుతం వారికి అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఆరోగ్యవంతమైన తల్లులు, పిల్లలు ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని […]

మధ్యాహ్న భోజనంలో జగన్ మార్క్ మార్పులు..!!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 03, 2019 | 7:14 PM

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలో సీఎం జగన్ సమీక్షించారు. గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పై వారితో చర్చించారు. ప్రస్తుతం వారికి అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఆరోగ్యవంతమైన తల్లులు, పిల్లలు ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలన్నారు. ఇక మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ పెంచడం పై దృష్టి పెట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్డ్‌ కిచెన్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఇవ్వడం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇక స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నవంబర్‌ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో సుమారు 15 వేలకు పైగా స్కూళ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి సురేష్ జగన్‌కు తెలిపారు. ఇక సౌకర్యాల కల్పనలో ఏ ఇతర స్కూళ్లకూ ప్రభుత్వ స్కూళ్లు తీసిపోకుండా ఉండాలని జగన్ నిర్ణయించారు. పది రూపాయలు ఎక్కువైనా సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దని సూచించారు. అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం నిర్ణయించారు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu