విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ కోసం జగన్ సర్కార్ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుబంధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా నియమిస్తూ నోటిఫికేషన్ వెలువరించారు.
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవలప్‌మెంట్ అథారిటీ పని చేయనుందని గవర్నమెంట్ ఉత్తర్వుల్లో పేర్కోంది. ఈ అథారిటీ వైస్ ప్రెసిడెంట్‌గా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఉంటారని సర్కార్ తెలిపింది. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.