Minister Perni Nani: సీజ్ చేసిన థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చిన సర్కార్.. కండిషన్స్ అప్లై..

|

Dec 30, 2021 | 12:34 PM

Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా నిబంధనలు పాటించడం లేదంటూ సీజ్ చేసిన థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకునేందుకు ఏపీ సర్కార్ అవకాశం ఇచ్చింది. ఇదే విషయంపై మంత్రి పేర్ని నాని..

Minister Perni Nani: సీజ్ చేసిన థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చిన సర్కార్.. కండిషన్స్ అప్లై..
Perni Nani Ap Movie Theater
Follow us on

Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా నిబంధనలు పాటించడం లేదంటూ సీజ్ చేసిన థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకునేందుకు ఏపీ సర్కార్ అవకాశం ఇచ్చింది. ఇదే విషయంపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. నెలరోజులు గడువుతో నిబంధనలు పాటించే అవకాశం ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే మంత్రి నాని స్వస్థలమైన మచిలీపట్నంలో మూతపడ్డ థియేటర్ ల యజమానులు కలిశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని స్పందిస్తూ.. థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

అయితే ఏపీ ప్రభుతం సినిమా టికెట్స్ ధరల విషయంలో అమల్లోకి తెచ్చిన జీవో నెంబర్ 35 రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చెయ్యడానికి అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, రెవిన్యూ అధికారులు తనిఖీలకు వెళ్లారు. 83 థియేటర్లకు సీల్ వేశారు. అయితే ప్రభుత్వం చెబుతున్న టికెట్స్ ధరలు తమకు వర్కౌట్ కావంటూ పలు జిల్లాల్లో స్వచ్చందంగా కొన్ని థియేటర్లను క్లోజ్ చేశారు.  ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లు వర్కవుట్ కాకే మూసేశామని బోర్డులు పెట్టారు.

ఓవైపు సంక్రాంతి సీజన్ వచ్చేసింది. సంక్రాంతి పండగ సమయంలో చిన్న, పెద్ద సినిమాలు వరసగా రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి. అసలే కరోనా తో కష్టాల్లో ఉన్న సమయంలో ఇప్పుడు థియేటర్స్ ను సీజ్ చేయడం  సబబు కాదని, రేట్ల విషయంలోనూ పునరాలోచించాలని ప్రభుత్వానికి విన్నపాలు అందాయి. తాజాగా నారారాయణ మూర్తి కూడా ఓ ఈవెంట్‌లో ఇదే వ్యాఖ్య చేశారు. అంతేకాదు.. సీల్‌ చేసిన థియేటర్ల యజమానులతో కలిసి వెళ్లి కాసేపటి క్రితం బందరులోని పేర్ని నాని ఇంట్లో భేటీ అయ్యారు. థియేటర్లు మూసివేత, టికెట్‌ రేట్లపై ఆయనతో చర్చిస్తున్నారు.

టికెట్ల రేట్లపై GO 35 అమలులో ఉన్నా.. రేట్ల నిర్దారణ కోసం ఓ కమిటీనీ వేశామని, ఆ రిపోర్ట్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని హామీ ఇచ్చిన పేర్ని నాని.. ఇటు సీల్ వేసిన థియేటర్లకూ ఊరటనిచ్చారు. ఫైన్లు కట్టి థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించారు. కానీ సిబ్బంది గమనించిన లోపాలను నెలరోజుల్లో సరిచేసుకోవాలని గడువు పెట్టారు. థియేటర్‌ తెరవాలి అనుకునే వాళ్లు జిల్లా  కలెక్టర్ కు అప్లికేషన్ పెట్టుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు.

Also Read:  తరచుగా భాగస్వామితో గొడవలు పడుతున్నారా.. అయితే బెడ్ రూమ్‌లోని ఈ వాస్తు దోషాలు విస్మరించకండి..