ఏపీలో క‌రోనా క‌ల్లోలం : జిల్లాల వారీగా వివ‌రాలు

|

Aug 09, 2020 | 8:00 PM

ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్ర‌త భారీగా పెరిగింది. అలాగే మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. గత కొన్ని రోజులుగా ప్ర‌మాద‌క‌రంగా ప్రతి రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

ఏపీలో క‌రోనా క‌ల్లోలం : జిల్లాల వారీగా వివ‌రాలు
Follow us on

AP Corona Latest Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్ర‌త భారీగా పెరిగింది. అలాగే మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. గత కొన్ని రోజులుగా ప్ర‌మాద‌క‌రంగా ప్రతి రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఆదివారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో కూడా పాజిటివ్ కేసులు సంఖ్య విస్మ‌య‌ప‌రిచింది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా టెస్టులు చేయ‌గా, ఏకంగా 10,820 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. కొత్త‌గా మ‌రో 97 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,860కు చేరగా..చ‌నిపోయిన‌వారి సంఖ్య 2,036కు చేరింది.

ఇక, కరోనా వైర‌స్ కార‌ణంగా గడిచిన 24 గంటల్లో…. గుంటూరు జిల్లాలో 12 మంది, ప్రకాశంలో 11 మంది, చిత్తూరు.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున‌, అనంతపురం.. కడప.. శ్రీకాకుళంలో 8 మంది చొప్పున‌, కర్నూలులో ఏడుగురు, తూర్పు గోదావరి..విశాఖపట్నంలో ఆరుగురు చొప్పున‌, కృష్ణా… నెల్లూరులో నలుగరు చొప్పున‌, విజయనగరంలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఇక గడిచిన 24 గంటల్లో 9,097 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

జిల్లాల వారీగా కొత్త కేసులు

తూర్పుగోదావరి జిల్లా 1,543
కర్నూలు జిల్లాలో 1,399,
పశ్చిమగోదావరి జిల్లాలో 1132
విశాఖ జిల్లాలో 961
గుంటూరు జిల్లాలో 881
అనంతపురం జిల్లాలో 859
చిత్తూరు జిల్లాలో 848
కడప జిల్లాలో 823
నెల్లూరు జిల్లాలో 696
శ్రీకాకుళం జిల్లాలో 452
కృష్ణా జిల్లాలో 439
ప్రకాశం జిల్లాలో 430
విజయనగరం జిల్లాలో 358

 

Also Read : నల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ