ఇళ్లపట్టాల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం.. నేటి నుంచి 15 రోజుల పాటు పట్టాల పంపిణీ

|

Updated on: Dec 25, 2020 | 4:45 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నేరవేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. "నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు.

ఇళ్లపట్టాల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం.. నేటి నుంచి 15 రోజుల పాటు పట్టాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నేరవేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. “నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు” కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీలో మోడల్‌ హౌస్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా “నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు” పైలాన్‌ను ఆవిష్కరించారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల మందికి పైగా నివాస స్థల పట్టాలను అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ ఇళ్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసిస్తామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Dec 2020 04:02 PM (IST)

    రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నిరంతర ప్రక్రియః జగన్

    రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని సీఎం తెలిపారు. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సీఎం.. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. పేద వాళ్లైన అగ్రకులాల వారికి సైతం ఇళ్ల నిర్మాణ చేపడుతున్నామన్నారు.

  • 25 Dec 2020 03:50 PM (IST)

    లబ్ధిదారుల పేరుతో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చేయించాలనుకున్నాంః జగన్

    రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇళ్లు ఇచ్చి తీరుతామన్న జగన్.. అర్హులైన లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాలనుకున్నామన్నారు. అయితే. స్వార్థంతో కొంత మంది కోర్టుకెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారని తెలిపారు. త్వరలోనే కోర్టు అడ్డంకులు తొలగగానే లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాలు పడటానికి రాజకీయ దురుద్దేశాలే కారణమన్న జగన్… పేదలకు మేలు జరుగుతుంటే పసుపు పార్టీల ముఖాల్లో ఎరుపు రంగుగా మారుతున్నాయని ఎద్దేవా చేశారు.

  • 25 Dec 2020 03:50 PM (IST)

    ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తాంః జగన్

    పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పేదలకు సరిపడే విధంగా 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచామన్నారు. ఇళ్ల నిర్మాణానికి కావల్సిన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే సమకురుస్తుంది. ఇళ్లను స్వయంగా నిర్మించుకునే వారికి ప్రభుత్వం లేబర్ ఛార్జీలను చెల్లిస్తుంది. ఇళ్ల నిర్మాణానికి దశవారిగా బిల్లులను ప్రభుత్వం ఇస్తుందని సీఎం తెలిపారు

  • 25 Dec 2020 03:39 PM (IST)

    కొత్త కాలనీల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తాంః జగన్

    రాష్ట్రవ్యాప్తంగా నిర్మించబోయే వైఎస్ఆర్ కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న సీఎం.. కొత్త కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే కాలనీల్లో పార్క్‌లు, కమ్యూనిటీహాల్స్‌, విలేజ్‌ క్లీనిక్‌లు, అంగన్‌వాడీలు ఏర్పాటు చేస్తున్నామని జగన్ తెలిపారు

  • 25 Dec 2020 03:37 PM (IST)

    ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి మందికి లబ్ధిః జగన్

    రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు సేల్ అగ్రిమెంట్లు పూర్తి చేశామని.. ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి మందికిపైగా మేలు జరుగుతుందన్నారు సీఎం

  • 25 Dec 2020 03:35 PM (IST)

    ఇళ్లు మాత్రమే కాకుండా ఊర్లు కడుతున్నాముః జగన్

    గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పేదలకు సొంతింటి కల నేరవేరలేదన్న సీఎం.. టీడీపీ సర్కార్ ఎన్నికల ముందు మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వెఎస్ఆర్ జగన్న కాలనీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రామాలను నిర్మించబోతుందన్నారు. ఇవాళ ఇళ్లు మాత్రమే కాకుండా ఊర్లు కడుతున్నామని చెప్పారు.

  • 25 Dec 2020 03:32 PM (IST)

    కుల, మత, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపికః జగన్

    ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతామన్ని సీఎం జగన్.. ఐదేళ్లలో 30.75 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామన్నారు. దాదాపు కోటి 24 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని సీఎం స్పష్టం చేశారు.

  • 25 Dec 2020 03:28 PM (IST)

    నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీః జగన్

    రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామన్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్‌మస్‌ పర్వదినాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం​ మొదలుపెట్టడం సంతోషంగా ఉందన్నారు.

  • 25 Dec 2020 03:27 PM (IST)

    మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నానుః జగన్

    నిలువనీడలేని నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తానని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాను. అందుకే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం జగన్‌ తెలిపారు.

  • 25 Dec 2020 03:26 PM (IST)

    పేదల కష్టాలను కళ్లారా చూశానుః జగన్

    సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు.

  • 25 Dec 2020 03:24 PM (IST)

    రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్ష 75 వేల ఇళ్ల పట్టాల పంపిణీ శ్రీకారంః జగన్

    రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్ష 75 వేల ఇళ్ల పట్టాల పంపిణీ శ్రీకారం చుడతున్నామని సీఎం జగన్ తెలిపారు. మొత్తం ఇళ్లల్లో 28 లక్షల 38 వేల ఇళ్లుగాను, 262 వేల అపార్టుమెంట్స్‌ల్లో ప్లాట్ల రూపంలో అందిస్తున్నామన్నారు. పేదల మహిళల్లో కళ్లల్లో ఆనందం చూడాలన్న సంకల్పంతోనే పట్టాల పంపిణి కార్యాక్రమం చేపట్టామని సీఎం జగన్ వెల్లడించారు.

  • 25 Dec 2020 03:20 PM (IST)

    పట్టాల పంపిణీ దేవుడిచ్చిన వరం

    రాష్ట్రంలో 30, 754 వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నన్నారు.

  • 25 Dec 2020 03:14 PM (IST)

    పట్టాలను పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్

    తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో 367 ఎకరాలల్లో 16,500 ప్లాట్లు వేశారు. వీటికి సంబంధించి పట్టాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలకు అందజేశారు. అధికారులు సేకరించిన 367.58 ఎకరాల్లో 60 ఎకరాలను సామాజిక అవసరాలకు వదిలేసి 16,500 ప్లాట్లను చక్కగా రూపొందించారు.

  • 25 Dec 2020 03:11 PM (IST)

    తొలి దశలో 28 వేల కోట్లతో 15 లక్షల 60 వేల ఇళ్లు

    రాష్ట్రవ్యాప్తంగా 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 28 లక్షల 30 వేల ఇళ్ల నిర్మాణానికి 50 వేల కోట్లను ఖర్చు చేయబోతోంది. తొలి దశలో 28 వేల కోట్లతో 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మిస్తుంది.

  • 25 Dec 2020 03:11 PM (IST)

    వైఎస్ఆర్ జగన్న కాలనీ పైలాన్‌ను ఆవిష్కరించిన జగన్

    తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌. అక్కడే ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మోడల్‌ హౌస్‌ను చూశారు. పైలాన్‌ను ఆవిష్కరించారు.

  • 25 Dec 2020 03:09 PM (IST)

    ఏపీలో పేదలకు "పట్టా"...భిషేకం

    ఏపీలో పేదలకు పట్టా...భిషేకం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇంటి పట్టాలు అందిస్తోంది ప్రభుత్వం. లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించింది. రెండు వారాలపాటు పండుగలా ఈ కార్యక్రమం జరుగుతుంది.

  • 25 Dec 2020 03:07 PM (IST)

    ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు

    లక్షలాది కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాస స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలకు శుభ ముహూర్తం వచ్చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు రెండు వారాల పాటు వాడవాడలా పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీలు చక్కటి వసతులతో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకున్నాయి.

Published On - Dec 25,2020 4:02 PM

Follow us
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు