సోషల్ మీడియా వారియర్లకు థాంక్స్: ఏపీ సీఎం జగన్

ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పాలనలోనూ దూసుకెళుతున్నారు జగన్. అధికారుల బదిలీలతో మరింత పట్టు సాధించే పనిలో ఉన్నారు. త్వరలోనే మంత్రివర్గ కూర్పును పూర్తి చేసి.. అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున సోషల్ మీడియాలో పోరాడిన నెటిజన్లకు జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పోరాడి.. ఎల్లో మీడియా అసత్య ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ ప్రశంసలు కురిపించారు. జగన్ తన ట్వీట్‌లో […]

సోషల్ మీడియా వారియర్లకు థాంక్స్: ఏపీ సీఎం జగన్
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 3:00 PM

ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పాలనలోనూ దూసుకెళుతున్నారు జగన్. అధికారుల బదిలీలతో మరింత పట్టు సాధించే పనిలో ఉన్నారు. త్వరలోనే మంత్రివర్గ కూర్పును పూర్తి చేసి.. అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమవుతున్నారు.

అయితే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున సోషల్ మీడియాలో పోరాడిన నెటిజన్లకు జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పోరాడి.. ఎల్లో మీడియా అసత్య ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ ప్రశంసలు కురిపించారు. జగన్ తన ట్వీట్‌లో ‘నేను రాష్ట్ర బాధ్యతలు స్వీకరించడానికి సహకరించిన సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు.. ఎల్లో మీడియాతో పోరాటం చేశారు. పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు.. మీ మద్దతు ఎప్పుడూ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

మరోవైపు ఏపీ ఎన్నికల్లో గెలుపు తర్వాత సోషల్ మీడియాలో సీఎం జగన్‌ క్రేజ్ పెరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు ట్విట్టర్‌లో ఫాలోవర్లు సంఖ్య 1 మిలియన్ దాటింది. ఇటు వైసీపీ ట్విట్టర్ అకౌంట్‌‌తో పాటూ అనుబంధ అకౌంట్లకు కూడా ఫోలోవర్ల సంఖ్య భారీగానే పెరిగింది. ఫేస్‌బుక్‌లో 1.8 మిలియన్లకు చేరింది.

Latest Articles