దేశంలో కరోనా కలవరం, 24 గంటల్లో 1,181 మరణాలు

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,821 కేసులు నమోదయ్యాయి. మరో 1,181 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.

దేశంలో కరోనా కలవరం, 24 గంటల్లో 1,181 మరణాలు
Follow us

|

Updated on: Oct 01, 2020 | 11:49 AM

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,821 కేసులు నమోదయ్యాయి. మరో 1,181 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. కాగా గత 24 గంటల్లో మరో 85,376 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు.  దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో  దాదాపు 40శాతం కేసులు సెప్టెంబర్ నెలలతోనే నమోదయ్యాయి. గత నెలలో దేశవ్యాప్తంగా 26లక్షల కేసులు నమోదయ్యాయి.

దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 63,12,584

కొత్త కేసులు : 86,821

దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసులు : 9,40,705

మొత్తం చనిపోయినవారి సంఖ్య : 98,678

కొత్తగా చనిపోయినవారు  : 1,181

దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీ అయ్యేవారి సంఖ్య  కూడా పెరగడం ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం, దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.53శాతం ఉండగా, డెత్ రేటు 1.56శాతంగా ఉంది.

Also Read :

పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ సర్కార్

ఏపీ గ్రామ సచివాలయ పరీక్షల ప్రాథమిక కీ విడుదల