అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి.. చివరి చూపు కల్పించాలంటూ కుటుంబసభ్యులు ఆవేదన..
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ తెలుగు మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఆమె హఠాత్తుగా...
America News Update: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ తెలుగు మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఆమె హఠాత్తుగా మరణించిందనే వార్త కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బదార్లపల్లి గ్రామానికి చెందిన హేమలతకు నాలుగేళ్ల క్రితం చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుధాకర్ నాయుడుతో 2016లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికా వెళ్లింది. న్యూయార్క్‌లో ఉంటున్న వీరికి ఇప్పుడు రెండున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. కాగా నాలుగు రోజుల క్రితం అమెరికా నుంచి సుధాకర్ నాయుడు.. హేమలత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె మరణించిందనే వార్త చెప్పాడు.
కాగా, హేమలత మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదని అంటున్నారు. కనీసం కడసారి చూపుకైనా తమకు అవకాశం కల్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరిపించేందకు వీలుగా హేమలత మృతదేహం తీసుకువచ్చేందుకు సహకరించాలని వారు కోరుతున్నారు.