డామిట్..కథ అడ్డం తిరిగింది.. భర్తను మోసం చేయాలనుకున్న భార్యకు అనుకోని షాక్ తగిలింది..
రాను రాను మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. మనుషుల మధ్య ప్రేమ తగ్గి కటువుగా ప్రవర్తిస్తున్నారు.
రాను రాను మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. మనుషుల మధ్య ప్రేమ తగ్గి కటువుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి మనసులో ఏముందో బయటపడే వరకు తెలియడం లేదు. తాజాగా ఓ వివాహిత తన ప్రేమికుడికి సాయం చేసేందుకు ఏకంగా కట్టుకున్న భర్తనే మోసం చేయాలని అనుకుంది. అతడి దగ్గర ఉన్న డబ్బులు కాజేసి లవర్‌తో జంప్ కావాలని భావించింది కానీ కథ అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయారు ఆ ఇద్దరు. వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి ఇల్లు కొనడం కోసం రూ. 40 లక్షలు జమ చేశాడు. అయితే ఈ డబ్బుపై అతడి భార్య కన్నుపడింది. ఈ మొత్తం తీసుకొని ప్రియుడికిచ్చి అతడితో పాటు జల్సా చేయాలని అనుకుంది. ఇందుకోసం ఆమె, ఆమె ప్రియుడు, అతడి తల్లి, స్థానిక బీబీఎంపీ డాక్టర్ కలిసి ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అనువైన సమయం కోసం వేచి చూసి అమలుచేశారు. పథకం ప్రకారం ముందుగా సోమశేఖర్‌కు కరోనా సోకినట్లు వైద్యుడితో ఓ నకిలీ కరోనా పాజిటివ్ సర్టిఫికెట్‌ను తెప్పించింది అతడి భార్య. అనంతరం తనకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పి మెడికల్ షాప్‌కు వెళ్లి ట్యాబ్లెట్ తీసుకురావాలని ఏమి తెలియనట్లుగా కోరింది. నిజమే అనుకున్న సోమశేఖర్ ట్యాబ్లెట్ల కోసం మెడికల్ షాప్‌కు వెళ్లాడు. అక్కడ రెడీగా ఉన్న భార్య ప్రియుడు, అతడి తల్లి, డాక్టర్ ఒక్కసారిగా అరిచి ఇతడికి కొవిడ్ ఉందని, ఆస్పత్రి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని తెలిపారు. అంతేకాకుండా స్థానికులతో కలిసి బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రూ.40 లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని చెప్పడంతో అతడికి అనుమానం వచ్చింది. సరే డబ్బు ఇస్తానని చెప్పి స్నేహితులక ఫోన్ చేసి తన భార్యను అడిగి డబ్బు తీసుకురావాలని కోరాడు. అతడి మాటల్లో భయాన్ని గమనించిన స్నేహితులు ఇంటికి వెళ్లి అతడి భార్యను విచారించగా తన భర్తకు కొవిడ్ వచ్చిందని మగాది రోడ్డులోని ఆస్పత్రిలో ఉన్నాడని తెలిపింది. స్నేహితులు ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయగా సోమశేఖర్ అక్కడ లేడు. దీంతో వారు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమశేఖరం భార్యను గట్టిగా విచారించడంతో కథ మొత్తం బయటికి వచ్చింది. దీంతో పోలీసులు సోమశేఖరం భార్యను, ఆమె ప్రియుడిని, అతడి తల్లిని, వారికి సహకరించిన డాక్టర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.