Mysterious Fish: మత్స్యకారుడి వలకు చిక్కిన వింత చేప.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?
అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి నదిలో ఓ మత్స్యకారుడికి అరుదైన సూకర్ ఫిష్ వలకు చిక్కింది. గతంలో ఎన్నడూ చూడని ఈ వింత చేపను చూసి ఆశ్చర్యపోయిన మత్స్యకారుడు అధికారులను సంప్రదించాడు. నీటిలో నాచును తినే ఈ చేప మంచి, ఉప్పునీటిలో జీవిస్తుంది. దీని ప్రత్యేక లక్షణాల గురించి నిపుణులు వివరించారు.

తీర ప్రాంతాలు, నదీ ఒడ్డున ఉంటూ నిత్యం సముంద్రం, నదల్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఒక్కోసారి ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. వారు విసిరిన వలలకు చిత్ర విచిత్ర జీవులు దొరుకుతుంటాయి. వాటిలో కొన్ని మత్స్యకారులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే అంబేద్కర్ కొనసీమ జిల్లాలో వెలుగు చూసింది. ఓ మత్స్యకారుడి వలకు విచిత్రమైన ఒక చేప చిక్కింది. దాన్ని చూసిన మత్స్యకారుడు ఆశ్చర్యపోయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి గోదావరిలో బుజ్జి అనే మత్స్యకారుడికి వలకు ఒక విచిత్రమైన చేప చిక్కింది. ఈ చేపను గతంలో ఎప్పుడూ చూడక పోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు మత్స్యకారుడు. చేప మొహంపై జల్లెడ లాంటి చారలు ఉండడంతో అక్కడున్న మత్స్యకారులంతా దాన్ని విచిత్రంగా చూసారు. దానికి గురించి తెలియకపోవడంతో దాన్ని వలలోంచి బయటకు తీసి.. ఫొటోలు, వీడియోలు తీసుకుని.. మళ్లీ గోదావరిలో వదిలేశాడు.
ఈ చేప ప్రత్యేక ఏమిటి
అయితే చేపను వదిలేసినా దాని గురించి ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న ఆ మత్స్యకారుడు. దాని ఫోటోలను తీసుకెళ్లి రాజోలు ఫిషరీషి AD చూపించారు. ఈ విచిత్రమైన చేప గురించి చెప్పాలని కోరాడు. అయితే ఇది సూకర్ ఫిష్ అని.. ఈ చేప చాలా అరుదుగా కనిపిస్తుందని అధికారుతు తెలిపారు. ఈ చేప నోటితో గాలిని పీల్చుకుంటుందని.. దీని తలపై ప్రత్యేక రెక్కలతో అతుకున్ని ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇవి మంచి నీటిలో, ఉప్పు నీటిలో జీవిస్తూ ఉంటాయని.. వీటిని పెద్ద పెద్ద ఎక్వేరియం సుబ్ర పరచడానికి పెంచుతారని అధికారులు తెలిపారు. ఎందుకంటే ఈ చేపలు నాచు తిని బ్రతుకుతాయని ఆయన వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
