అమెజాన్ లో వచ్చే ఏడాది జూన్ వరకు వర్క్ ఫ్రం హోం

కొవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ దిగ్గజమైన అమెజాన్ తన ఉద్యోగులకు 2021 జూన్ 30వతేదీ వరకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు వీలు కల్పించింది.

అమెజాన్ లో వచ్చే ఏడాది జూన్ వరకు  వర్క్ ఫ్రం హోం
Follow us

|

Updated on: Oct 21, 2020 | 1:49 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రజల్లో కరోనా భయం తగ్గేలా లేదు. అయితే, ఐటీ కంపెనీలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ ఉద్యోగులకు మరి కొన్ని రోజులపాటు ఇంటి నుంచే పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా కొవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ దిగ్గజమైన అమెజాన్ తన ఉద్యోగులకు 2021 జూన్ 30వతేదీ వరకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు వీలు కల్పించింది. ‘‘మా కంపెనీ ఉద్యోగులు 2021 జూన్ 30వతేదీ వరకు ఇంటి నుంచి సమర్థవంతంగా పనిచేసేందుకు మేం అనుమతిస్తున్నాం’’ అని అమెజాన్ ప్రతినిధి తాజాగా ఈ మెయిల్ పంపించారు. అమెజాన్ అంతకు ముందు 2021 జనవరి వరకే ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించింది. దీన్ని ప్రస్తుతం వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికి వినియోగదారులను కలిగిన ఈ కామర్స్ ఆన్ లైన్ రిటైలర్ సంస్థ అయిన అమెజాన్ లో పనిచేస్తున్న 19వేల మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి సమయంలో అమెజాన్ వ్యాపార లావాదేవీలు కొనసాగించడంతో ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని సిబ్బంది చెప్పారు. సామాజిక దూరం పాటించడం, థర్మల్ తనిఖీుల చేయడం, ఫేస్ మాస్కులు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లు వాడటం వల్ల తాము సురక్షితంగా ఉన్నామని అమెజాన్ ప్రతినిధి చెప్పారు. ఇప్పటికే ఫేస్ బుక్ వచ్చే ఏడాది జులై వరకు, గూగుల్ సంస్థ వచ్చే ఏడాది జూన్ వరకు వర్క్ ఫ్రం హోంకు అనుమతి ఇచ్చాయి. ఇక, మరిన్ని ఐటీ కంపెనీలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి.

Latest Articles
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే