AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Freedom Festival: టాప్ బ్రాండ్ ఏసీలపై 46శాతం వరకూ తగ్గింపు.. మళ్లీ మళ్లీ రాదు అవకాశం.. మిస్ చేసుకోవద్దు..

మార్కెట్లో బెస్ట్ ఆఫర్లు మీ కోసం అందుబాటులో ఉన్నాయి. అవి కూడా టాప్ బ్రాండ్ ఎయిర్ కండీషనర్లపై తిరుగులేని ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ను ఈ రోజే ప్రారంభించింది. దీనిలో ఎయిర్ కండీషనర్లపై ఏకంగా 46శాతం వరకూ డిస్కౌంట్ ప్రకటించింది. వీటిల్లో టాప్ బ్రాండ్లు అయిన డయాకిన్, లాయిడ్, శామ్సంగ్, హైయర్, ఎల్జీ ఒల్టాస్, గోద్రెజ్ వంటివి ఉన్నాయి.

Amazon Freedom Festival: టాప్ బ్రాండ్ ఏసీలపై 46శాతం వరకూ తగ్గింపు.. మళ్లీ మళ్లీ రాదు అవకాశం.. మిస్ చేసుకోవద్దు..
Lloyd 1.5 Ton 3 Star Inverter Split Ac
Madhu
|

Updated on: Aug 04, 2023 | 11:59 AM

Share

మీరు ఏసీ కొనాలని చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తున్నారా? సమయానికి చేతిలో డబ్బు లేకనో.. మంచి ఆఫర్లు లేవనే వెనుకడుగు వేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో బెస్ట్ ఆఫర్లు మీ కోసం అందుబాటులో ఉన్నాయి. అవి కూడా టాప్ బ్రాండ్ ఎయిర్ కండీషనర్లపై తిరుగులేని ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ను ఈ రోజే ప్రారంభించింది. దీనిలో ఎయిర్ కండీషనర్లపై ఏకంగా 46శాతం వరకూ డిస్కౌంట్ ప్రకటించింది. వీటిల్లో టాప్ బ్రాండ్లు అయిన డయాకిన్, లాయిడ్, శామ్సంగ్, హైయర్, ఎల్జీ ఒల్టాస్, గోద్రెజ్ వంటివి ఉన్నాయి. ఈ అమెజన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఆగస్టు ఎనిమిదో తేదీ వరకూ ఉంటుంది.

లాయిడ్ 1.5 టన్ 3-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. దీనిపై 44% తగ్గింపు లభిస్తోంది. దీంతో కేవలం రూ. 32,999 కే ఇది లభిస్తోంది. ఇది 1.5-టన్నుల కెపాసిటీతో వస్తుంది. 160 చదరపు అడుగుల వరకు అంటే మీడియం సైజు గదులకు అనుకూలంగా ఉంటుంది. ఇది 2-వే ఎయిర్ స్వింగ్ టెక్నాలజీతో 52డిగ్రీల సెంటిగ్రేడ్ పరిసర ఉష్ణోగ్రత వద్ద కూడా గదిని చల్లబరుస్తుంది.

పానసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ.. దీనిపై 30% తగ్గింపు లభిస్తుంది. అంటే దీనిని మీరు రూ. 44,490 కు కొనుగోలు చేయొచ్చు. ఇది గది ఉష్ణోగ్రతను అంచనా వేసి, ఏసీ సామర్థ్యాన్ని పెంచడం, తగ్గించడం చేస్తుంది. అందుకోసం ఇన్‌బిల్ట్ సెన్సార్‌లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని ఇందులో వినియోగించారు. ఇది ఏఐ మోడ్ తో 7-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్‌లను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. ఈ ఏసీ కొనుగోలుపై 41% తగ్గింపు లభిస్తుంది. దీనిని మీరు రూ. 44,490 కి కొనుగోలు చేయొచ్చు. ఇది వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌ని కలిగి ఉంది. ఇది ఉష్ణ భారాన్ని బట్టి శక్తిని సర్దుబాటు చేస్తుంది. ఏఐ కన్వర్టిబుల్ 6-ఇన్-1తో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఏసీ సామర్థ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.

డయాకిన్ 1.5టన్ 3 స్టార్ ఇన్వెర్టర్ స్ప్లిట్ ఏసీ.. దీనిపై కూడా మీకు 36% తగ్గింపు లభిస్తుంది. రూ. 37,490 కి దీనిని కొనుగోలు చేయొచ్చు. అధిక శక్తి సామర్థ్యం కోసం ఇన్వర్టర్ స్వింగ్ కంప్రెసర్‌తో ఇది వస్తుంది. ఆరోగ్యకరమైన గాలిని నిర్ధారించడానికి డ్యూ క్లీన్ టెక్నాలజీ దీనిలో ఉంచారు. ఇది చిన్న-పరిమాణ(111 నుంచి 150 చదరపు అడుగులు) గదులకు అనుకూలంగా ఉంటుంది.

క్యారియర్ 1.5 టన్ను 5 స్టార్ ఏఐ ఫ్లెక్సీ కూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. దీనిపై కూడా మీకు 46% తగ్గింపు లభిస్తుంది. దీనిని మీరు రూ. 40,999 కే కొనుగోలు చేయొచ్చు. ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌తో వస్తుంది, ఇది హీట్ లోడ్‌ను బట్టి శక్తిని సర్దుబాటు చేస్తుంది. ఫ్లెక్సికూల్ కన్వర్టబుల్ 6-ఇన్-1 ఇన్వర్టర్ టెక్నాలజీతో వినియోగదారు శీతలీకరణ సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. 50% వరకు విద్యుత్ వినియోగాన్ని ఆదా చేయవచ్చు.

శామ్సంగ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వెర్టర్ స్ల్పిట్ ఏసీ.. దీనిపై 42% తగ్గింపు తర్వాత రూ. 42,499కి లభిస్తుంది. పవర్ సేవింగ్ మోడ్‌తో 5-స్టార్ బీఈఈ రేటింగ్‌ను కలిగి ఉంది. కన్వర్టిబుల్ 5ఇన్1 మోడ్‌లతో, మీరు మీ మానసిక స్థితి, అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇది వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌ను కూడా కలిగి ఉంది.

గోద్రెజ్ 1.5 టన్ను 4 స్టార్ 4 వే స్వింగ్, ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. ఇది 32% తగ్గింపు తర్వాత రూ. 33,990 వద్ద లభిస్తుంది. ఇన్వర్టర్ కంప్రెసర్, 100% కాపర్ కండెన్సర్, ఎవాపరేటర్ కాయిల్స్, కనెక్టింగ్ ట్యూబ్, ఆర్32 రిఫ్రిజెరాంట్, బ్యాక్‌లిట్ రిమోట్, యాంటీ-ఫ్రీజ్ థర్మోస్టాట్, సైలెంట్ ఆపరేషన్, యాంటీ-మైక్రోబయల్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీతో 5-ఇన్-1 కన్వర్టిబుల్ టెక్నాలజీతో వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..