జూలై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:11 PM

న్యూఢిల్లీ : అమర్‌నాథ్ యాత్ర ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాటి నుంచి ప్రారంభంకానుంది. అంటే జూలై 1నుంచి ప్రారంభమై ఆగస్టు 15 (రక్షాబంధన్) వరకూ కొనసాగనుంది. ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది అమర్‌నాథ్ యాత్ర 60 రోజులు జరిగింది. ఈ సారి ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటివారం వరకూ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన […]

జూలై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం
Amarnath Yatra 2021
Follow us on

న్యూఢిల్లీ : అమర్‌నాథ్ యాత్ర ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాటి నుంచి ప్రారంభంకానుంది. అంటే జూలై 1నుంచి ప్రారంభమై ఆగస్టు 15 (రక్షాబంధన్) వరకూ కొనసాగనుంది. ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది అమర్‌నాథ్ యాత్ర 60 రోజులు జరిగింది. ఈ సారి ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటివారం వరకూ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 440 బ్రాంచీల ద్వారా ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కాగా ఈసారి అమర్‌నాథ్ యాత్రకు మరింత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. అలాగే ఈసారి కూడా 13 ఏళ్ల కన్నా తక్కువ, 75 ఏళ్ల కన్నా ఎక్కవ వయసుగల వారికి యాత్ర చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. అలాగే ఆరు నెలలు దాటిన గర్భవతులు కూడా యాత్ర చేసేందుకు అవకాశం లేదు.