‘కుడి ఎడమైతే’ అంటోన్న అమలాపాల్.. ‘ఆహా’ వెబ్ సిరీస్‌లో నటించనున్న తమిళ ముద్దుగుమ్మ.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదల కానున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి తమిళ నటి అమలా పాల్ ఓకే చెప్పారు. ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సిరీస్‌లో అమలా నటించనున్నారు..

‘కుడి ఎడమైతే’ అంటోన్న అమలాపాల్.. ‘ఆహా’ వెబ్ సిరీస్‌లో నటించనున్న తమిళ ముద్దుగుమ్మ.

Updated on: Dec 24, 2020 | 9:59 AM

Amala paul in aha web series: ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టడంతో బడా హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌ల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ప్లాఫ్ ఫామ్‌లకు రోజురోజుకీ పెరుగుతోన్న ఆదరణే దీనికి కారణం. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదల కానున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి తమిళ నటి అమలా పాల్ ఓకే చెప్పారు.
‘బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నటి అమలాపాల్ ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఈ అందాల తార ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్‌లో నటిస్తోన్న అమలా పాల్.. ఆహా ఓటీటీ వేదిక కోసం ‘కుడి ఎడమైతే’ అనే మరో తెలుగు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘యు టర్న్’ చిత్ర దర్శకుడు పవన్‌ కుమార్‌ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్‌లో నటించడానికి ఓకే చెప్పారు. ఇక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌ను 8 భాగాలుగా తీసుకురానున్నారు. ఇందులో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండడం విశేషం.