AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అల..వైకుంఠపురములో’ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టు అంతే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అల..వైకుంఠపురములో’. మాస్ అండ్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఎన్నో భారీ అంచనాల నడుమ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫన్ […]

'అల..వైకుంఠపురములో' ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టు అంతే..!
Ravi Kiran
|

Updated on: Jan 12, 2020 | 2:19 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అల..వైకుంఠపురములో’. మాస్ అండ్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఎన్నో భారీ అంచనాల నడుమ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫన్ ఎలిమెంట్స్‌, అదిరిపోయే పాటలతో ఫస్ట్ హాఫ్ జాలీగా సాగిపోతుందని.. ప్రీ ఇంటర్వెల్ సీన్ ఎంతో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా కొన్ని సీన్‌లు త్రివిక్రమ్ సాగదీసినట్లు అనిపించినా.. పూర్తి ఫీల్‌తో ఎంజాయ్ చేసే విధంగా సినిమాను రూపొందించారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ప్రత్యేకంగా చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పాటలకు బన్నీ వేసే స్టెప్పులు అదిరిపోయాయని.. థియేటర్లలో అరుపులే అని తెలుస్తోంది.

వెన్నెల కిషోర్- సునీల్ కామెడీ, టబు-జయరాం మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయట. మొత్తానికి గురూజీ మార్క్ టేకింగ్, అల్లు అర్జున్ స్వాగ్, తమన్ అదిరిపోయే మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. హీరోయిన్లు పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ గ్లామర్ చిత్రానికి బాగా ప్లస్ అయిందట. మొత్తానికి అటు మాస్‌ను, ఇటు క్లాస్ ఆడియన్స్‌కు నచ్చే విధంగా త్రివిక్రమ్ ఫుల్ ట్రీట్ ఇచ్చారని అంటున్నారు.

Follow Us