బన్నీ తమ్ముడు సర్పంచ్…!
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర మరో వార్త చక్కర్లు...

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘పుష్ప’లో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా., దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఇందులో ఎవరు నటించేవారి పేర్లు బయటకు వస్తున్నాయి. అంతేకాదు వారి ఏ పాత్రలో నటించనున్నారనేది కూడా ఇప్పుడు చర్చ జరగుతోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర మరో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ కనిపించనున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ మూవీలో కథానుగుణంగా అల్లుఅర్జున్ కు ఇద్దరు సోదరులుంటారట. వీరిలో ఓ సోదరుడు గ్రామ సర్పంచ్‌గా కనిపిస్తారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
కొద్దిగా పొలిటికల్ టచ్ ఇస్తూనే ఈ సినిమా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రంగస్థలం సినిమాలో రాంచరణ్ సోదరుడిగా ఆదిపినిశెట్టిని సుకుమార్ ఎంపిక చేశారట. అంతేకాదు సినిమాకు ఈ పాత్ర కీలకం అని కూడా మూవీ వర్గాల ద్వారా తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.




