బన్నీ వాసూకి కూడా నా ఆస్తి రాస్తానని భయపడ్డారు!

అల్లు అరవింద్.. తెలుగు ఇండస్ట్రీకి పరిచయం లేని వ్యక్తి. పేరుకు నిర్మాతే అయినా.. ఏ ప్రొడ్యూసర్‌కి లేని క్రేజ్ ఈయన సొంతం. అందులోనూ.. మోగాస్టార్ చిరంజీవి బావమరిదిగా మరింత స్టార్‌డమ్ ఉంది అల్లు అరవింద్‌కి. అయితే.. ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ‘ప్రతీరోజూ పండుగే’ సినిమా సక్సెస్ మీట్‌ సందర్భంగా.. అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. అందులోనూ అది ఆస్తుల టాపిక్ అయ్యే సరికి .. టాలీవుడ్‌లో హాట్‌గా వైరల్ అవుతోంది. మెగా కుటుంబానికి […]

బన్నీ వాసూకి కూడా నా ఆస్తి రాస్తానని భయపడ్డారు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 26, 2019 | 8:41 PM

అల్లు అరవింద్.. తెలుగు ఇండస్ట్రీకి పరిచయం లేని వ్యక్తి. పేరుకు నిర్మాతే అయినా.. ఏ ప్రొడ్యూసర్‌కి లేని క్రేజ్ ఈయన సొంతం. అందులోనూ.. మోగాస్టార్ చిరంజీవి బావమరిదిగా మరింత స్టార్‌డమ్ ఉంది అల్లు అరవింద్‌కి. అయితే.. ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ‘ప్రతీరోజూ పండుగే’ సినిమా సక్సెస్ మీట్‌ సందర్భంగా.. అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. అందులోనూ అది ఆస్తుల టాపిక్ అయ్యే సరికి .. టాలీవుడ్‌లో హాట్‌గా వైరల్ అవుతోంది.

మెగా కుటుంబానికి ప్రొడ్యూసర్ బన్నీ వాసు విధేయుడేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్‌కి కూడా బన్నీవాసు అంటే చాలా ఇష్టం. అందుకే గీతా ఆర్ట్స్ 2 బాధ్యతలన్నీ ఆయనకే అప్పగించాడు. కాగా.. బన్నీ వాసుతో కలిపి నాకు నలుగురు కొడుకులని ఇప్పటికే చాలా సందర్భాల్లో అల్లు అరవింద్ ప్రస్తావించిన వించారు. బాబి, అర్జున్, శిరీష్‌తో పాటుగా వాసు కూడా నాకు కొడుకు లాంటి వాడే అని ఆయన మరోసారి ప్రతీరోజు పండగే విజయోత్సవ వేదికగా గుర్తు చేసుకున్నారు.

ఇటీవల.. అల్లు అరవింద్ తన కొడుకులందరికీ అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు చేసిన విషయం గుర్తుంది కదా. ఆ సమయంలో బన్నీ వాసూకి కూడా తన ఆస్తి పంచుతానేమోనని నా కొడుకులు భయపడ్డారంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఈ వ్యాఖ్యలకు అక్కడున్నవారంతా గొల్లున నవ్వారు.