సీరం వారి కోవిషీల్డ్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్.. ఆరోపించిన వాలంటీర్.. రూ.5 కోట్లు పరిహారం కోరుతూ లీగల్ నోటీసు..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఈ మాయదారి రోగం కారణంగా వేలాది మంది ప్రాణాలను సైతం కోల్పోయారు. దాదాపు ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరగుతున్నా.. ఈ వైరస్ ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు కోవిడ్ 19 వ్యాక్సిన్ల ప్రయోగాలు చేపడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఈ మాయదారి రోగం కారణంగా వేలాది మంది ప్రాణాలను సైతం కోల్పోయారు. దాదాపు ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరగుతున్నా.. ఈ వైరస్ ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు కోవిడ్ 19 వ్యాక్సిన్ల ప్రయోగాలు చేపడుతోంది. అందులో ఒకటి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కోవీషీల్డ్ కాగా, మరొకటి నోవావ్యాక్స్. ఐసీఎంఆర్‌తో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ రెండు వ్యాక్సిన్ల మూడో దశ ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలపై ఐసీఎంఆర్ సంతృప్తి వ్యక్తం చేసింది.
అయితే పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం ట్రయల్స్‌లో పాల్గొన్న చెన్నైవాసి సీరం సంస్థకు లీగల్ నోటీసులు పంపాడు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అతని శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడినట్లు కుటుంబసభ్యలు ఆరోపించారు. అతనిలో తీవ్రమైన నాడీ సమస్యలతో పాటు మానసిక లక్షణాలకు గురయ్యాడని ఆరోపించారు. దీంతో టీకా పరీక్ష, తయారీ, పంపిణీ ఆపాలంటూ ఐసిఎంఆర్, డిసిజిఐ, ఆస్ట్రాజెనెకా అండ్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి లీగల్ నోటీసు పంపించారు. ఇందుకోసం రూ.5 కోట్ల రూపాయల పరిహారం కోరుతూ ఒక న్యాయ సంస్థ అతని తరపున లీగల్ నోటీసు పంపింది.
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే రేసులో కోవిషీల్డ్ ముందువరుసలో ఉంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సహకారంతో సీరం సంస్థ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. పుణేకు చెందిన సీరం సంస్థ ఒక బిలియన్ మోతాదుల కోవిషీల్డ్ టీకా తయారీకి స్వీడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా ఉండగా ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్ తీసుకున్న వలంటీర్లలో ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని, ఎవరూ ఆసుపత్రి పాలు కాలేదని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ టీకామందు 90 శాతం ఎఫెక్టివ్ అని తాము భావిస్తున్నట్టు ఈ సంస్థ రీసెర్చర్లు చెప్పారు.
ఇదిలావుంటే, తాజాగా చెన్నైకి చెందిన 40 సంవత్సరాల వయసు కలిగిన ఓ వ్యక్తి అక్టోబర్ 1న కోవిషీల్డ్ వ్యాక్సిన అందించారు. అయితే, దీంతో చాలా దుష్ప్రభావం చూపిస్తుందని కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. దీంతో సీరం సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. వ్యాక్సిన్ వాలంటీర్ పాల్గొన్న తర్వాత “తీవ్రమైన న్యూరో ఎన్సెఫలోపతి” తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అతను, అతని కుటుంబం అనుభవించే అన్ని బాధలకు కనీసం పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని సమస్యలకు సీరం సంస్థ బాధ్యత వహించాలని తెలిపారు.
కాగా, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కాకుండా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్, జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్‌కు నోటీసు పంపించారు. ప్రయోగశాల విశ్వవిద్యాలయం, శ్రీ రామచంద్ర ఉన్నత, పరిశోధన వైస్-ఛాన్సలర్, అక్కడ పాల్గొనేవారికి ప్రయోగ వ్యాక్సిన్‌ను అందించారు. ఈ ప్రయోగాల్లో పాల్గొన్నవారిలో తలనొప్పితో బాధపడుతున్నారని, ఆపై ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఏడు రోజుల పాటు బస చేశారని లీగల్ నోటీసు పేర్కొంది. అతను అనుభవిస్తున్న అన్ని బాధలకు, అతని ఆరోగ్యానికి అనిశ్చిత రావాలంటే, ఈ నోటీసు అందినప్పటి నుండి రెండు వారాల వ్యవధిలో అతనికి రూ. 5కోట్లు ఆర్థిక పరిహారం ఇవ్వాలి” అని నోటీసు వెల్లడించారు.
అయితే, మేము నోటీసు పంపిన పార్టీల నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు. ముందుకు వెళ్లి రిట్ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండడం తప్ప మాకు వేరే మార్గం లేకుండా పోతుందని బాధితుడి తరపున న్యాయవాది ఆర్. రాజారామ్ అన్నారు. కాగా, ఈ నోటీసులకు సంబంధించి సీరం సంస్థ గానీ, ఐసిఎంఆర్, డిసిజిఐ, ఆస్ట్రాజెనెకా అండ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కాని స్పందించలేదు.