AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాసేపట్లో ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగం

మరో చారిత్రాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు PSLV C – 49 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇందులో భాగంగా నిన్న మధ్యాహ్నం ఒంటిగంట 2 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. PSLV C – 49 రాకెట్‌ ద్వారా నింగిలోకి 10 ఉపగ్రహాలను పంపనున్నారు. EOS -01 అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ […]

కాసేపట్లో ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగం
Venkata Narayana
|

Updated on: Nov 07, 2020 | 12:58 PM

Share

మరో చారిత్రాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు PSLV C – 49 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇందులో భాగంగా నిన్న మధ్యాహ్నం ఒంటిగంట 2 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. PSLV C – 49 రాకెట్‌ ద్వారా నింగిలోకి 10 ఉపగ్రహాలను పంపనున్నారు. EOS -01 అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనుంది. ప్రయోగం కోసం ఇప్పటికే ఇస్రో చైర్మన్‌, శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని షార్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీహరి కోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా ఇంకెవ్వరికీ షార్‌లోనికి అనుమతించడం లేదు. PSLV C సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం. శ్రీహరికోట షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు PSLV C – 49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. మొదట ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. అయితే- కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. కరోన ప్రభావంతో ఇస్రో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క ప్రయోగం కూడా చేపట్టలేదు.

Follow Us
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు
4 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్..
4 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్..