ఏపీ కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ : గోపాలకృష్ణ ద్వివేదీ

ఏపీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కోసం దాదాపు 21వేల మంది సిబ్బంది అవసరమని తెలిపారు ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీ. ఓట్ల లెక్కింపులో ఎవరు పాల్గొంటారో.. చివరివరకూ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో.. ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లు లెక్కింపు ఉంటుందన్నారు. ముందుగా పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు ఉంటుందని.. అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాలకు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు ద్వివేదీ. టేబుళ్ల పెంపు కోసం విశాఖ, పశ్చిమ […]

ఏపీ కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ : గోపాలకృష్ణ ద్వివేదీ

Edited By:

Updated on: Apr 25, 2019 | 6:17 PM

ఏపీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కోసం దాదాపు 21వేల మంది సిబ్బంది అవసరమని తెలిపారు ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీ. ఓట్ల లెక్కింపులో ఎవరు పాల్గొంటారో.. చివరివరకూ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో.. ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లు లెక్కింపు ఉంటుందన్నారు. ముందుగా పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు ఉంటుందని.. అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాలకు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు ద్వివేదీ. టేబుళ్ల పెంపు కోసం విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఒక్కో టేబుల్‌ వద్ద సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తామన్నారు. కాగా.. రీ పోలింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఏపీ సీఈవో గోపాల కృష్ణ ద్వివేది.