AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరా గ్రూప్స్ కేసులో దర్యాప్తు వేగవంతం.. దేశవ్యాప్తంగా కేసులన్ని హైదరాబాద్ సీసీఎస్ కు బదిలీ

సామాన్య ప్రజల నుంచి స్కీముల పేరుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించిన హీరా గ్రూప్స్ కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వందల కోట్ల రూపాయల స్కాములకు పాల్పడ్డ హీరా గ్రూప్స్‌ అధినేత్రి నౌహీరా షేక్‌పై ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు తెలంగాణకు బదిలీ అవుతున్నాయి.

హీరా గ్రూప్స్ కేసులో దర్యాప్తు వేగవంతం.. దేశవ్యాప్తంగా కేసులన్ని హైదరాబాద్ సీసీఎస్ కు బదిలీ
Balaraju Goud
|

Updated on: Dec 19, 2020 | 2:26 PM

Share

సామాన్య ప్రజల నుంచి స్కీముల పేరుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించిన హీరా గ్రూప్స్ కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వందల కోట్ల రూపాయల స్కాములకు పాల్పడ్డ హీరా గ్రూప్స్‌ అధినేత్రి నౌహీరా షేక్‌పై ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు తెలంగాణకు బదిలీ అవుతున్నాయి. ఢిల్లీలో నమోదైన ఓ కేసును పోలీసులు హైదరాబాద్‌ సీసీఎ్‌సకు బదిలీ చేశారు. ఎక్కువ వడ్డీ ఆశజూపి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించింది హీరా గ్రూప్స్. నిధులను తన వ్యక్తిగత ఖాతాల్లోకి దారిమళ్లించిన ఆరోపణలపై నౌహీరాను సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశీయుల నుంచి హీరా గ్రూప్స్‌ దేశవ్యాప్తంగా 1,72,114 మంది డిపాజిటర్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు వసూలు చేసినట్లు సీసీఎస్‌ విచారణలో వెల్లడైంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులు సేకరించడం, నిధుల దారిమళ్లింపునకు సంబంధించి మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నౌహీరా షేక్‌తోపాటు సంస్థ ప్రతినిధులు బీజూ థామస్‌, మోలీ థామ్‌సను గతంలో విచారించింది.

ఈ స్కాములకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళతోపాటు అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు, సౌదీ అరేబియా, పశ్చిమాసియా దేశాల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు సీసీఎస్ ఆధారాలు సేకరించింది. ఇప్పటికీ ఇంకా బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. దీంతో అయా పోలీసులు కేసుల్ని హైదరాబాద్ సీసీఎస్ కు బదిలీ చేస్తున్నారు.

సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..