అమర్‌నాధ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి

మంచుకొండల్లో సహజసిద్ధంగా ఏర్పడే శివలింగాన్ని దర్శించుకునే సమయం ఆసన్నమైంది. ప్రతిఏటా ఈ లింగదర్శనం కోసం వేలకొద్దీ భక్తులు తరలివెళ్తారు. ఈ ఏడాది తొలి బృందం జూన్ 30న బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమర్‌నాధ్ యాత్రికులు ఇప్పటికే జమ్మూ బేస్ క్యాంప్‌కు తరలివచ్చారు. వీరందరినీ సురక్షితంగా గమ్యస్ధానానికి చేర్చేందుకు పౌర వాలంటీర్లు, పలు స్వచ్ఛంద సంస్ధల్ని సిద్ధం చేశారు. జులై 1 నుంచీ ఆగస్టు 15 వరకూ జరిగే అమరనాధ్ యాత్రలో మహా శివలింగ దర్శనం కోసం […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:13 pm, Fri, 28 June 19
అమర్‌నాధ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి

మంచుకొండల్లో సహజసిద్ధంగా ఏర్పడే శివలింగాన్ని దర్శించుకునే సమయం ఆసన్నమైంది. ప్రతిఏటా ఈ లింగదర్శనం కోసం వేలకొద్దీ భక్తులు తరలివెళ్తారు. ఈ ఏడాది తొలి బృందం జూన్ 30న బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమర్‌నాధ్ యాత్రికులు ఇప్పటికే జమ్మూ బేస్ క్యాంప్‌కు తరలివచ్చారు. వీరందరినీ సురక్షితంగా గమ్యస్ధానానికి చేర్చేందుకు పౌర వాలంటీర్లు, పలు స్వచ్ఛంద సంస్ధల్ని సిద్ధం చేశారు.

జులై 1 నుంచీ ఆగస్టు 15 వరకూ జరిగే అమరనాధ్ యాత్రలో మహా శివలింగ దర్శనం కోసం భక్తులు తరలివస్తారు. ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే చాలా మంది భక్తులకు టోకెన్లూ, సూచన పత్రాలను పంపిణీ చేశారు. వీటిలో ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచబడి ఉంటాయి. అలాగే యాత్ర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనల సమాచారం కూడా ఉంటుంది. వీటిలో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

మంచు శివలింగాన్ని దర్శించేందుకు తరలివచ్చే భక్తులకు సాయం చేసేందుకు జమ్మూ పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం నియమించింది. ఈ ఏర్పాట్లపై అమర్‌నాధ్ యాత్రికులు సంత‌ృప్తిని వ్యక్తం చేస్తున్నారు.