గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో నేతల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కనివిని ఎరుగని రీతిలో ఈ సారి ప్రచారం సాగుతుంది. అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంఐఎం-బీజేపీ నాయకుల మధ్య మాటలు హీట్ పుట్టిస్తున్నాయి. అక్బరుద్దీన్ ఒవైసీ దూకుడు ఆగడం లేదు. నిన్నటికి నిన్న… దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేయాలని సవాల్ చేసిన ఆయన – తాజాగా బీజేపీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చాయ్ వాలా పార్టీ పునాదులు లేవన్నారు. బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఎంత కష్ట పడ్డా కూడా మూసీ నది దాటలేరని స్పష్టం చేశారు. మూసీకి అవతలే తప్ప.. ఇవతలకు రాలేరన్నారు. పెద్ద పెద్ద తోపులు కూడా మమ్మల్ని ఏమీ చేయలేక వెళ్ళిపోయారు.. వీళ్లెంత అంటూ బీజేపీపై మండిపడ్డారు. తాను హిందూ వ్యతిరేకిని అని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని అక్బరుద్దీన్ విమర్శించారు.