టాలీవుడ్‌లోకి మరో స్టార్ హీరో డాటర్!

| Edited By:

Jan 31, 2020 | 12:38 PM

టాలీవుడ్‌లో వారసులకు కొదవేం లేదు. అసలు తెలుగు ఇండస్ట్రీలో 90 శాతం వరకూ వాళ్లే ఉన్నారు. వీరిలో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిలయ్యారు. అయితే.. ఇప్పుడు తన కూతురి కెరీర్‌కు మరింత సక్సెస్ ఫుల్ బాటలు పరిచేందుకు స్వయంగా ఓ స్టార్ హీరో రంగంలోకి దిగారు. ఎక్కువగా అటు కన్నడ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలకు సుపరిచితుడైన సీనియర్ హీరో అర్జున్. తన డాటర్‌ని తెలుగు సినిమాకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాని స్వయంగా ఆయనే […]

టాలీవుడ్‌లోకి మరో స్టార్ హీరో డాటర్!
Follow us on

టాలీవుడ్‌లో వారసులకు కొదవేం లేదు. అసలు తెలుగు ఇండస్ట్రీలో 90 శాతం వరకూ వాళ్లే ఉన్నారు. వీరిలో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిలయ్యారు. అయితే.. ఇప్పుడు తన కూతురి కెరీర్‌కు మరింత సక్సెస్ ఫుల్ బాటలు పరిచేందుకు స్వయంగా ఓ స్టార్ హీరో రంగంలోకి దిగారు. ఎక్కువగా అటు కన్నడ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలకు సుపరిచితుడైన సీనియర్ హీరో అర్జున్. తన డాటర్‌ని తెలుగు సినిమాకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాని స్వయంగా ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడట.

తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలతో కూడా అక్కడి ఆడియన్స్‌ని ఆకట్టుకున్న అర్జున్.. తన కూతురు ఐశ్వర్యని టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నారు. తన కూతురి సినిమాకి అతనే దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే నిర్మాత కూడా ఓకే అన్నారు. ఇంకేముంది.. త్వరలోనే ఈ సినిమాను మొదలు పెట్టనున్నారని సమాచారం.

కాగా.. ఐశ్వర్య 2019లో విశాల్ హీరోగా నటించిన ‘పట్టాత్తు యావై’ అనే కన్నడ సినిమాతో పరిచయమైంది. ఆ తరువాత రెండు, మూడు సినిమాలు చేసింది. అవి కూడా అచ్చిరాకపోవడంతో.. స్వయంగా అర్జున్ తన కూతురును టాలీవుడ్‌కి పరిచయం చేయాలని చూస్తున్నారు.