Airtel Offers: ఇప్పుడు ఎయిర్‌టెల్ వంతు.. నెల రోజుల వ్యాలిడిటీతో రెండు కొత్త ప్లాన్స్.. బెనిఫిట్స్ ఇవే..
Airtel Offers: నెల రోజుల కాల వ్యవధితో కూడిన ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ నెట్‌వర్క్ సంస్థలు ఆదేశించిన నేపథ్యంలో జియో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రకటించిన..

Airtel Offers: నెల రోజుల కాల వ్యవధితో కూడిన ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ నెట్‌వర్క్ సంస్థలు ఆదేశించిన నేపథ్యంలో జియో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి ఎయిర్‌టెల్ కూడా వచ్చింది. తాజాగా ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో రెండు రీచార్జ్ ప్లాన్స్‌ను పరిచయం చేసింది. రూ. 296, రూ. 310 ప్రీప్రెయిడ్ ప్లాన్స్‌ను లాంచ్ చేసింది. వీటి ద్వారా లభించే బెనిఫిట్స్ ఏంటి.? లాంటి వివరాలు మీకోసం..
రూ. 296 ప్లాన్..
రూ. 296తో రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల పాటు అన్‌లిమిడెట్ కాల్స్ పొందొచ్చు. అలాగే 30 రోజుల పాటు 25 జీబీ 4జీ హైస్పీడ్ డేటా అందిస్తారు. హైస్పీడ్ డేటా కోటా ముగిసిన తర్వాత ఒక్క ఎంబీకి 50 పైసా చార్చ్ చేస్తారు. రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందిస్తారు. అనంతరం ఒక లోకల్ ఎస్‌ఎమ్‌ఎస్‌కు రూ. 1, ఎస్టీడీ ఎస్‌ఎమ్‌ఎస్‌కు రూ. 1.5 చార్జ్ చేస్తారు. వీటితో పాటు 30 రోజుల అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ట్రాయల్ వెర్షన్, మూడు నెలల అపోలో 24/7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌పై రూ.100 క్యాష్‌బాక్, ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్, హల్లో ట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.
రూ. 310 ప్లాన్..
ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా ఇస్తారు. అనంతరం ఇంటర్‌నెట్ స్పీడ్ 64 కేపీబీఎస్‌కు తగ్గిస్తారు. వీటితో పాటు 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ట్రాయల్ వెర్షన్, మూడు నెలల అపోలో 24/7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌పై రూ.100 క్యాష్‌బాక్, ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్, హల్లో ట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తున్నారు.
RGV Dhahanam: ‘ఎక్కడ హింస ముగుస్తుందో అక్కడ దహనం మొదలవుతుంది’.. వర్మ మార్క్ కొత్త వెబ్ సిరీస్..
