వందే భారత్ మిషన్: ఎయిర్ ఇండియా రాకపోకలపై హాంకాంగ్ నిషేధం!

| Edited By:

Aug 18, 2020 | 9:46 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు

వందే భారత్ మిషన్: ఎయిర్ ఇండియా రాకపోకలపై హాంకాంగ్ నిషేధం!
Follow us on

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్న విషయం విధితమే. అయితే హాంకాంగ్ అధికారులు తాజాగా ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించారు. ఈ నిషేధం వల్ల భారత్ నుంచి హాంకాంగ్‌కు.. హాంకాంగ్ నుంచి భారత్‌కు ఎయిర్ ఇండియా సేవలు అందించడానికి లేదు. కరోనా నేపథ్యంలోనే ఈ నిషేధాన్ని విధించినట్టు తెలుస్తోంది.

మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. హాంకాంగ్ విధించిన ఆంక్షల వల్ల ఎయిర్ ఇండియా ఈ రోజు ఢిల్లీ నుంచి హాంకాంగ్‌కు.. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి నడవాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్టు వెల్లడించింది. ఇక తాజాగా నిషేధమే విధిస్తున్నట్టు వెల్లడించడంతో ఈ విమానాలు రద్దు కానున్నాయి. కాగా.. ఇప్పటివరకు 10.5 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకొచ్చామని గత గురువారం విదేశాంగశాఖ అధికారి అనురాగ్ శ్రీవాత్సవ వెల్లడించారు.