తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన కళ్లకురిచ్చి దళిత ఎమ్మెల్యే ప్రభు(34) డిగ్రీ సెంకండ్ ఇయర్ చదువుతోన్న టీనేజీ యువతని ప్రేమ వివాహం చేసుకున్నారు. అది కూడా కులాంతర వివాహం కావడంతో ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభు లవ్ మ్యారేజ్ తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఎమ్మెల్యే ప్రభు ఇంట్లో నిరాడంబరంగా ఈ వివాహం జరిగిపోయింది. త్యాగదుర్గం మలైకోటై గ్రామానికి చెందిన సౌందర్యతో ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు ప్రభు. సౌందర్య తండ్రి అదే ఊరిలో అర్చకుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం సౌందర్య బీఏ ఇంగ్లిష్ రెండో ఏడాది చదువుతున్నారు.
అయితే, సౌందర్య కుటుంబసభ్యులు వివాహానికి మొదట ఒప్పుకోకపోయినప్పటికీ తర్వాత సుముఖం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే ప్రభుకు సౌందర్య గత పదేళ్లుగా తెలుసని.. అయితే గత ఏడాదిన్నర కాలం నుంచి వీరిద్దరూ ప్రేమించుకున్నారని తమిళనాట భోగట్టా. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత టికెట్ ఇవ్వడంతో 2016 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు ప్రభు. అధికార పార్టీలో పెళ్లికాని ఎమ్మెల్యే అంటే ప్రభు పేరే ఠక్కున చెప్పేవారిప్పటివరకూ. ఎవరినీ రౌడీలతో బెదిరించి సౌందర్యని పెళ్లి చేసుకోలేదు : ఎమ్మెల్యే ప్రభు