ఉగ్రదాడి నేపథ్యంలో 39 దేశాలకు వీసా సౌకర్యం రద్దు

శ్రీలంక ప్రభుత్వం చాలా ఏళ్ల నుంచి టూరిజం డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టింది. ఏడాదికేడాది టూరిస్టుల సంఖ్య పెంచుకుంటోంది. టూరిజం పై 2018లో శ్రీలంకకు 3.5 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దీనిని ఏడు బిలియన్ డాలర్లు గా మార్చుకోవడానికి టూరిస్టులకు అనేక రకాల ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ టార్గెట్ చేరుకోవడానికి 39 దేశాలకు ఫ్రీ వీసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. సహజంగా ఏదైనా బయటి దేశానికి వెళ్లాలంటే ముందుగా వీసా రావాల్సి […]

ఉగ్రదాడి నేపథ్యంలో 39 దేశాలకు వీసా సౌకర్యం రద్దు
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 9:30 PM

శ్రీలంక ప్రభుత్వం చాలా ఏళ్ల నుంచి టూరిజం డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టింది. ఏడాదికేడాది టూరిస్టుల సంఖ్య పెంచుకుంటోంది. టూరిజం పై 2018లో శ్రీలంకకు 3.5 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దీనిని ఏడు బిలియన్ డాలర్లు గా మార్చుకోవడానికి టూరిస్టులకు అనేక రకాల ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ టార్గెట్ చేరుకోవడానికి 39 దేశాలకు ఫ్రీ వీసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది.

సహజంగా ఏదైనా బయటి దేశానికి వెళ్లాలంటే ముందుగా వీసా రావాల్సి ఉంటుంది. శ్రీలంక ఈ రూల్ ను సడలించింది. శ్రీలంకకు వెళ్లిన తర్వాత టూరిస్టులకు అక్కడ వీసా ఇస్తారు. దీనినే ‘ ఫ్రీవీసా ’ అంటారు. మొత్తం 39 దేశాలకు శ్రీలంక ‘ ఫ్రీవీసా ’ సదుపాయం కల్పించింది. ఈ దేశాల నుంచి టూరిస్టులు విమాన మెక్కి శ్రీలంకలో దిగి అక్కడే వీసా తీసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ వల్ల ఆదాయం 20శాతం పెరుగుతుందని టూరిజం వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2018 లో దీనిని ఒక పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీలంక ప్రభుత్వం మొదలెట్టింది. శ్రీలంకలోని కాసినోలు ప్రపంచవ్యాప్తంగా పేరొందాయి. ఇందులో జూదం ఆడటానికి అనేక దేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. శ్రీలంకలో పదేళ్ల నుంచి టూరిజం పుంజుకుంది. 2009 లో శ్రీలంకకు వెళ్లిన టూరిస్టుల సంఖ్య ఐదు లక్షల లోపే. కిందటేడాది ఈ సంఖ్య 20లక్షలకు చేరుకుంది.

ఈస్టర్ రోజు జరిగిన పేలుళ్లతో టూరిజం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా బస చేసే లగ్జరీ హోటల్స్ ను టెర్రరిస్టులు టార్గెట్ చేసుకోవడంతో ఫారినర్స్ కు భద్రత లేదన్న ప్రచారం జోరందుకుంది.ఈ ఘటనతో 39 దేశాలకు ఇచ్చే ఫ్రీ వీసా సదుపాయాన్ని ప్రభుత్వం రద్దుచేసింది.

RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే