టాయిలెట్ లో ఏడాదిగా గడిపిన మహిళ………. జీవితంలో మళ్ళీ వసంతం చిగురించిన వేళ …

| Edited By: Phani CH

Jun 17, 2021 | 4:35 PM

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ మహిళ ఏడాది పాటు ఎలా గడిపిందో గానీ టాయిలెట్ లోనే గడిపింది. వర్షాలకు తాను ఉంటున్న చిన్న ఇల్లు కూడా కూలిపోవడంతో ఇక టాయిలెట్ నే తన ఇంటిగా మార్చుకుంది.

టాయిలెట్ లో ఏడాదిగా గడిపిన మహిళ.......... జీవితంలో మళ్ళీ వసంతం చిగురించిన వేళ ...
After Living In Toilet For
Follow us on

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ మహిళ ఏడాది పాటు ఎలా గడిపిందో గానీ టాయిలెట్ లోనే గడిపింది. వర్షాలకు తాను ఉంటున్న చిన్న ఇల్లు కూడా కూలిపోవడంతో ఇక టాయిలెట్ నే తన ఇంటిగా మార్చుకుంది. 45 ఏళ్ళ ఈ మహిళ పేరు మురుగ. భర్త, దత్తత తీసుకున్న కూతురు ఈమెను వదిలి ఏటో వెళ్లిపోగా ఒంటరిగా ఏ ఆధారమూ లేక మరుగుదొడ్డిలోనే ఉంటూ వచ్చింది. ఈమె దయనీయ స్థితిని స్థానిక టీవీ ఛానల్ గురువారం ప్రసారం చేయడంతో.. విద్యుత్ శాఖ మంత్రి కె. కృష్ణన్ కుట్టి చలించిపోయారు. తాను కూడా పాలక్కాడ్ జిల్లాకే చెందినవాడైనందున.. మురుగ గురించి జిల్లా అధికారులకు ఫోన్ చేసి వివరాలు కనుగొన్నారు. ఈ మహిళ పడిన కష్టాలు తెలుసుకుని ఎంతో బాధ కలిగిందని, ఆమెకు వెంటనే సాయం చేయాలనీ అధికారులను ఆదేశించానని ఆయన చెప్పారు. ఇంతకాలం టాయిలెట్ లోనే జీవించిన ఫలితంగా ఆమె ఆరోగ్యం కూడా దెబ్బ తిన్నదని తెలిసిందన్నారు. మంత్రి ఆదేశాలతో అధికారులు ఆమె ఉంటున్న ప్రదేశానికి వెళ్లి మొదట ఆమెను ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ లో కాలికి దెబ్బ తగిలిన కారణంగా మురుగ ఓ కర్ర సాయంతో నడుస్తోంది.

చుట్టుపక్కలవారు ఇచ్చిన ఆహారంతో ఆమె తన ఆకలి తీర్చుకుంటూ వచ్చిందట.. జనతాదళ్-ఎస్ కి చెందిన యువజన విభాగం ఈమెకు చిన్న ఇంటి సౌకర్యం కూడా కలుగజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు తనకెంతో సంతోషంగా ఉందని, అధికారులు తనను చూడడానికి వచ్చారని మురుగ పేర్కొంది. తనను ఇంతకాలంగా ఆదుకున్నవారికందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:  Helping others: ఇతరులకు సహాయం చేసే ప్రజల్లో పేద దేశాలే టాప్.. భారత్ ర్యాంక్ 14.. ధనిక దేశాలు కింది వరుసలో!

Hungry: తల్లీ, ఐదుగురు పిల్లల కన్నీటి గాధ.. లాక్‌డౌన్‌లో పనులు లేక రెండు నెలలుగా పస్తులు..