అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..
అంతర్జాతీయ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే 'చిన్న తలా'గా అభిమానులు పిలుచుకునే సురేష్ రైనా కూడా తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు.
Suresh Raina Retires From International cricket: అంతర్జాతీయ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే ‘చిన్న తలా’గా అభిమానులు పిలుచుకునే సురేష్ రైనా కూడా తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. 2005లో తన మొదటి మ్యాచ్ ఆడిన రైనా.. 2018 జూలైలో చివరి వన్డే ఆడాడు. ”ధోని.. నీతో కలిసి క్రికెట్ ఆడడాన్ని పూర్తిగా ఆస్వాదించాను. నాకు ఎంతగానో సంతృప్తిని ఇచ్చింది. నీతో కలిసి ఈ జర్నీలో ప్రయాణించాలని అనుకుంటున్నా. థాంక్యూ ఇండియా. జై హింద్.” అంటూ ట్వీట్ చేశాడు.
తలా, చిన్న తలా ఇద్దరూ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో అటు ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇద్దరూ కూడా చెన్నై తరపున యూఏఈలో ఐపీఎల్ ఆడనున్నారు.
https://www.instagram.com/p/CD6d3QChY-V/?utm_source=ig_web_copy_link