కరోనా ఎఫెక్ట్.. ఆ డాక్టర్ చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..!

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాలో వేలమంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘కరోనా’ సోకిన వారికి చికిత్స అందించేందుకు చైనాలోని ఓ వైద్యుడు తన వివాహ తంతును కేవలం పది నిమిషాల్లో ముగించుకొని తిరిగి విధులకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను చైనా సామాజిక మాధ్యమం వైబోలో ఉంచడంతో.. నెట్టింట్లో వైరల్‌ అయింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైరస్‌ అత్యంత వేగంగా […]

కరోనా ఎఫెక్ట్.. ఆ డాక్టర్ చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..!

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాలో వేలమంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘కరోనా’ సోకిన వారికి చికిత్స అందించేందుకు చైనాలోని ఓ వైద్యుడు తన వివాహ తంతును కేవలం పది నిమిషాల్లో ముగించుకొని తిరిగి విధులకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను చైనా సామాజిక మాధ్యమం వైబోలో ఉంచడంతో.. నెట్టింట్లో వైరల్‌ అయింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. చైనాలోని షాన్‌డాంగ్‌లోని హెజె ప్రాంతానికి చెందిన లి జిక్వింగ్… షాన్‌డాంగ్ యూనివర్శిటీ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. ‘కరోనా’ బయటపడక ముందే అతడికి వివాహం నిశ్చమైంది. దీంతో జనవరి 30న పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ‘కరోనా’ తీవ్రత అధికంగా ఉండడంతో రోగులకు చికిత్స అందించడంలో ఆయన నిమగ్నమయ్యాడు. ఈ పరిస్థితుల్లో వధూవరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వివాహాన్ని వాయిదా వేయకూడదని నిర్ణయించుకున్నారు.

వధూవరులు వారి తల్లిదండ్రుల సమక్షంలో కేవలం పది నిమిషాల్లో వివాహ తంతును ముగించారు. వెంటనే వరుడు లి జిక్వింగ్ యథావిధిగా తన విధులకు హాజరయ్యాడని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. రోగులకు చికిత్స అందించడం కోసం జీవితంలో ఎంతో కీలక ఘట్టాన్ని త్వరగా ముంగించుకొని వృత్తి ధర్మానికి కొత్త నిర్వచనం చెప్పినందుకు అతడిని పలువురు అభినందించారు. అందుకు అంగీకరించిన వధువు యు హోంగ్యాన్‌ను కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Published On - 1:00 am, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu