ఆఫ్ఘన్‌పై పాక్ రాకెట్ దాడులు.. 9 మంది మృతి, 50 మందికి గాయాలు
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. గతకొద్ది రోజులుగా ఆఫ్ఘన్, పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉంటుంది. తాలిబన్ ఉగ్రవాదులతో పాక్ ఉగ్రవాదులు..

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. గతకొద్ది రోజులుగా ఆఫ్ఘన్, పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉంటుంది. తాలిబన్ ఉగ్రవాదులతో పాక్ ఉగ్రవాదులు చేతులు కలిపి.. ఆఫ్ఘన్ సైన్యంపై దాడి చేస్తోంది. మరోవైపు పాక్ సైన్యం కూడా ఆఫ్ఘన్ సరిహద్దుల వెంట కాల్పులకు దిగుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజాగా గురువారం నాడు పాక్ సైన్యం.. కాందహార్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్దక్ జిల్లా నివాస ప్రాంతాలపై రాకెట్ దాడులకు దిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ఆఫ్ఘన్ ప్రజలు మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆఫ్ఘన అధికార వర్గాలు వెల్లడించాయి. పాక్ తీరుపై ఆఫ్ఘన్ సీరియస్‌గా ఉంది. ఇప్పటికే ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ పాక్ సైన్యంపై రివేంజ్ తీసుకునేందుకు రెడీగా ఉండాలని తెలిపింది. ఆఫ్ఘన్ భూభాగంపై పాక్ రాకెట్లు ప్రయోగిస్తే.. ప్రతీకారం ఊహించని రీతిలో ఉంటుందని ఆఫ్ఘన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
At least nine civilians were killed and 50 others were wounded in Pakistani forces rocket attacks on “residential areas” in Spin Boldak district, Kandahar province, on Thursday: Afghanistan’s TOLOnews
— ANI (@ANI) July 31, 2020
Read More
కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తైవాన్ మాజీ అధ్యక్షుడు ఇక లేరు