ఆఫ్ఘనిస్థాన్‌లో రాజకీయ హత్యలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తాలిబన్లు మాత్రమే ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఎవరు చేస్తున్నారన్నది ఇక్కడ పెద్ద మిస్టరీగా మారింది. తాజాగా ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ బంధువు ఒకరు హత్యకు గురయ్యారు. కాబుల్‌లోని ఆయన ఇంట్లోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనకు కారణం ఎవరన్నది
ఇంకా తెలియ రాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.
A cousin of Afghanistan President Ashraf Ghani found shot to death inside his home in Kabul: Afghanistan Media
— ANI (@ANI) July 4, 2020