సమంత సరికొత్త వ్యాపారం.. ఎమోషనల్ పోస్ట్

చిన్న తనం నుంచీ కృషి, పట్టుదల, నిబద్దతతో ఒక రేంజ్ కు చేరుకుంది హీరోయిన్ సమంత. హీరోయిన్ గా ఉన్నత శిఖరాల్ని అధిరోహించి ఉన్నింటి కోడలు కూడా అయింది. వైవాహిక జీవితాన్నిసైతం ఎంతో ఆహ్లాదభరితంగా గడుపుతోంది...

సమంత సరికొత్త వ్యాపారం.. ఎమోషనల్ పోస్ట్

Updated on: Sep 05, 2020 | 3:30 PM

చిన్న తనం నుంచీ కృషి, పట్టుదల, నిబద్దతతో ఒక రేంజ్ కు చేరుకుంది హీరోయిన్ సమంత. హీరోయిన్ గా ఉన్నత శిఖరాల్ని అధిరోహించి ఉన్నింటి కోడలు కూడా అయింది. వైవాహిక జీవితాన్నిసైతం ఎంతో ఆహ్లాదభరితంగా గడుపుతోంది. అయితే నిన్న సాయంత్రం బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నానంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆమె చేసిన పోస్ట్ అందరిలోనూ అనేక ఊహాగానాలకు తెరతీసింది. ఇవాళ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆ సస్పెన్స్ ను బ్రేక్ చేసింది. తాను ప్రారంభించబోయే కొత్త వ్యాపారం గురించి చెప్పింది. చిన్న నాటినుంచి తనకున్న కలను సాకారం చేసుకునేందుకు తాజాగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి దిగుతున్నానని సమంత పేర్కొంది. తన సొంత బ్రాండ్ గురించి చెబుతూ.. ‘సాకీ ఫైనల్‌గా వచ్చింది. ఇది నా బిడ్డలాంటిది.. దీని కోసం ఎన్నో కలలు కన్నాను.. ఫ్యాషన్ పట్ల నాకున్న ప్రేమకు నిదర్శనమే ఇది. నా సినిమా కెరీర్ ప్రారంభించకుముందు నుంచే ఫ్యాషన్ ప్రపంచం, మ్యాగజైన్‌లతో నా జీవితం ముడిపడి ఉంది’ అని సమంత వెల్లడించింది. స్కూల్, కాలేజ్ డేస్ లో ఫ్యాషన్ డిజైనర్ దుస్తులను కొనుక్కునే స్థోమత లేదు. కానీ హీరోయిన్‌గా మారాక.. ఎందరో గొప్ప గొప్ప ఫ్యాషన్ డిజైనర్లు క్రియేట్ చేసిన దుస్తులు వేసుకున్నాను. నా సంతకంతో ఉన్న దుస్తులను ధరించాను. ఇది ఎంతో ఎమోషనల్‌తో కూడుకున్న జర్నీ. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ ‘సాకి’ మన స్నేహబంధానికి, నా జీవితంతో ముడిపడున్నవారందరికీ ఎంతో స్పెషల్. మేము దీన్ని త్వరలోనే ప్రారంభించబోతోన్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ బట్టలు ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంచేలా, తక్కువ ధరకే లభించేలా ఉంటాయి. చూస్తూనే ఉండండి.. అంటూ చెప్పుకొచ్చింది సమంత.