Shamna Kasim: అందమైన పాటకు అదిరిపోయే మూమెంట్స్‌‌‌‌‌తో మెస్మరైజ్ చేసిన హీరోయిన్..

షమ్న కాసిమ్.. ఈ పేరు వింటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కాని పూర్ణ అంటే మాత్రం ఇమ్మీడియట్‌గా ఓ అందమైన రూపం మన కళ్లలో మెరుస్తుంది.

Shamna Kasim: అందమైన పాటకు అదిరిపోయే మూమెంట్స్‌‌‌‌‌తో మెస్మరైజ్ చేసిన హీరోయిన్..
Actress Poorna

Edited By:

Updated on: Jul 19, 2021 | 6:20 AM

Shamna Kasim : షమ్న కాసిమ్.. ఈ పేరు వింటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కాని పూర్ణ అంటే మాత్రం ఇమ్మీడియట్‌గా ఓ అందమైన రూపం మన కళ్లలో మెరుస్తుంది. అవును క్లాసికల్ డ్యాన్స్‌లో A క్లాస్‌ పర్ఫార్మెన్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ.. 2004 ” మంజు పొలొరు పెంకుట్టీ” అనే మలయాళ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత శ్రీహరి నటించిన శ్రీ మహాలక్ష్మీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అల్లరి నరేష్ “సీమ టపాకాయ్‌” ఇచ్చిన హిట్తో టాలీవుడ్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు పూర్ణ. ఇక రవిబాబు అవును, అవును 2 సినిమాలతో మరింతగా పాపులర్‌ అయి… ప్రస్తుతం బుల్లి తెరపై షోలను చేస్తూ.. క్రేజీ సెలబ్రెటీగా మారారు.

ఇక తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసి తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తున్నారు పూర్ణ. ఢీ జోడి కొరియోగ్రాఫర్ అభితో.. బాలు అలనాటి సాంగ్ “మాటేరాని చిన్నదాని” సాంగ్‌కి డ్యాన్స్‌ వేసి.. అందరి చేత వావ్‌ అని అనిపించుకుంటున్నారు..నెట్టింట వైరల్ అవుతున్నారు. అందమైన పాటకు బ్యూటీ ఫుల్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేశారు పూర్ణ. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు ఓకే చెప్తున్నా పూర్ణ .. ప్రస్తుతం బాలయ్య సినిమాలో కీలక పాత్రలో నాటుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..

Venkatesh: “నారప్ప” సినిమాకు తీవ్రంగా శ్రమించా.. అయినా ఇలా.. అభిమానులకు క్షమాపలు చెప్పిన వెంకటేశ్..

Annapurna: ఆ తప్పు చేశానని అందరూ కలిసి చెట్టుకు కట్టేశారు.. అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..