బిర్లా మందిర్: నౌబత్ పహాడ్ కొండపై నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా తెల్లని రాజస్థానీ పాలరాతితో నిర్మించబడింది. ఇక్కడి నుండి హైదరాబాద్ నగరం, హుస్సేన్ సాగర్ అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు.
చౌమహల్లా ప్యాలెస్: ఒకప్పుడు నిజాం రాజుల అధికారిక నివాసమైన ఈ ప్యాలెస్,వారి వైభవానికి ప్రతీక. ఇది పర్షియన్,ఇండో-సార్సెనిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ప్యాలెస్ హైదరాబాద్ చరిత్రను కళ్ళకు కడుతుంది.
చార్మినార్: హైదరాబాద్ నగరానికి ఐకాన్ వంటి చార్మినార్‌ను 1591లో కులీ కుతుబ్ షా నిర్మించారు. నాలుగు ఎత్తైన మినార్లతో ఉన్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పానికి నిదర్శనం. దీని పై అంతస్తు నుండి పాతబస్తీ అందాలను చూడవచ్చు.
లాడ్ బజార్: చార్మినార్ పక్కనే ఉన్న ఈ పురాతన మార్కెట్ రంగురంగుల గాజులకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. గాజులతో పాటు ముత్యాలు, పాతకాలపు ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు ఇక్కడ లభిస్తాయి.
మక్కా మసీద్: చార్మినార్‌కు అతి సమీపంలో ఉన్న ఈ మసీదు భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి. దీని నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలను మక్కా నుండి తెచ్చిన మట్టితో తయారు చేశారని ప్రతీతి
సాలార్ జంగ్ మ్యూజియం: ప్రపంచంలోని అతిపెద్ద ఏకవ్యక్తి సేకరణ కలిగిన మ్యూజియం ఇది. సాలార్ జంగ్ III సేకరించిన వేలాది అరుదైన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. వివిధ దేశాలకు కళాఖండాలు ఇక్కడ చూడొచ్చు.
నిజాం మ్యూజియం: పురానీ హవేలీలో ఉన్న ఈ మ్యూజియంలో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు అందిన ఖరీదైన బహుమతులు ప్రదర్శించబడ్డాయి. ఇక్కడ ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వర్డ్‌రోబ్ ప్రధాన ఆకర్షణ.
హుస్సేన్ సాగర్: నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు తీరాన ఈ పార్క్ ఉంది. ఇక్కడ ఉన్న బుద్ధుని విగ్రహాన్ని బోటు ద్వారా దగ్గర నుండి చూడవచ్చు. సాయంత్రం వేళ జరిగే మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్ షో పర్యాటకులకు వినోదాన్ని అందిస్తాయి.